వరల్డ్‌కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అలా అనేసరికి షాక్ అయ్యా... పాక్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌...

First Published Jan 19, 2022, 4:12 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ చరిత్రలో తొలిసారి టీమిండియాపై విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. 2021 టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ కలిసి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

టీ20ల్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌ని ఓడించడం కూడా ఇదే మొదటిసారి...

పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 79 పరుగులు చేయగా, బాబర్ ఆజమ్ 68 పరుగులు చేసి అజేయంగా నిలిచి 17.5 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించారు...

ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత సారథి విరాట్ కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లతో కలిసి మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది...

‘విరాట్ కోహ్లీ వరల్డ్ నెం.1 ప్లేయర్, కెప్టెన్ కూడా. క్రికెట్ ఆడేటప్పుడు మేమంతా ఓ కుటుంబమే. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ప్రవర్తన చూసి షాక్ అయ్యా...

రిషబ్ పంత్‌ రివర్స్ స్వీప్ ఆడినప్పుడు మేం రివ్యూ తీసుకున్నాం. దానికి వెంటనే, ‘మీరేం చేస్తున్నారు? మమ్మల్ని 10 ఓవర్లలోపే ఆలౌట్ చేసేస్తారా? ఏంది?’ అన్నాడు..

విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అలా ఫన్నీగా కామెంట్లు చేస్తూ, ప్రత్యర్థి ప్లేయర్లతో జోక్స్ వేస్తాడనుకోలేదు. నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా గేమ్‌లో భాగమే...

నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా విరాట్ కోహ్లీతో మాట్లాడాను. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా. ఆయనతో ఏం మాట్లాడానో చెప్పను, కానీ విరాట్ కోహ్లీ చాలా మంచి వ్యక్తి...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ రిజ్వాన్...

2021లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన మహ్మద్ రిజ్వాన్, కేవలం పొట్టి ఫార్మాట్‌లోనే 1326 పరుగులు చేశాడు. 

click me!