Aus Vs NZ: క్వారంటైన్ కష్టాలతో ఆసీస్-కివీస్ వన్డే సిరీస్ రద్దు.. రాస్ టేలర్ కు నిరాశ..

Published : Jan 19, 2022, 01:52 PM IST

Australia Vs New Zealand Series Postponed: కరోనా విషయంలో మిగతా దేశాల మాదిరిగా చూసీ చూడనట్టు వ్యవహరించకుండా పకడ్బందీ నిబంధనలను అమలు చేస్తున్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు తాజాగా... 

PREV
17
Aus Vs NZ: క్వారంటైన్ కష్టాలతో ఆసీస్-కివీస్ వన్డే సిరీస్ రద్దు.. రాస్ టేలర్ కు నిరాశ..

ఇండియా-పాకిస్థాన్ రేంజ్ లో కాకపోయినా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య పోరు అంటే ఆ రెండు దేశాల  క్రికెట్ అభిమానులకు పండుగే. ఈ అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు చూడటానికి  ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. 

27

కానీ కొద్దిరోజులుగా  ఆసీస్-కివీస్ అభిమానుల ఆశలపై కరోనా నీళ్లు చల్లుతున్నది.  వరుసగా గతంలో రెండు సార్లు వాయిదా పడుతూ వస్తున్న చాపెల్ -హ్యాడ్లీ  వన్డే సిరీస్ మళ్లీ వాయిదా పడింది. 
 

37

కరోనానే దీనికి ప్రధాన కారణం.  న్యూజిలాండ్ లో కొద్దిరోజులుగా మళ్లీ పెరుగుతున్న  కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులతో ఆ దేశం అప్రమత్తమైంది.దేశంలో కొత్త ఆంక్షల్ని విధించింది. ఏదైనా దేశం నుంచి తమ  దేశంలోకి వచ్చేవాళ్లు తప్పనిసరిగా పదిరోజుల పాటు  క్వారంటైన్  లో ఉండాలని నిబంధనలను విధించింది. 

47

ఆస్ట్రేలియా వేదికగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 9 దాకా ఇరు దేశాల మధ్య  వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. జనవరి 30 న తొలి వన్డే, ఫిబ్రవరి 2న రెండో వన్డే, ఫిబ్రవరి 5న మూడో వన్డే తో పాటు  8వ తేదీన  ఏకైక టీ20 ఆడాల్సి ఉంది.

57

కానీ సరిహద్దు ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈ సిరీస్ ను మరోసారి వాయిదా వేశాయి.  కొద్దిరోజుల్లోనే  ఈ వన్డే సిరీస్ నిర్వహణపై ప్రకటన వెల్లడిస్తామని రెండు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.

67

ఇదిలాఉండగా ఆస్ట్రేలియాలో  ఇది వేసవి కాలం సీజన్.  ఈ సీజన్ లో వన్డే సిరీస్ షెడ్యూల్ లేకుండా ఖాళీగా ఉండటం ఆసీస్ కు గడిచిన 44 ఏండ్లలో ఇదే తొలి సారి కావడం  గమనార్హం. 

77

కాగా.. ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ తో టెస్టుల నుంచి రిటైర్ అయిన  న్యూజిలాండ్  వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ కు తాజాగా ఆసీస్ తో సిరీస్  వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురి చేసేదే.  ఆసీస్ తో వన్డే సిరీస్ తర్వాత అతడు వన్డేలకు కూడా గుడ్ బై చెప్పాలనుకున్నాడు. కానీ  క్వారంటైన్ సమస్యలతో ఈ సిరీస్ వాయిదాపడటం అతడికి తీవ్రంగా నిరాశకు గురి చేసేదే. 

click me!

Recommended Stories