Kohli-Iyer-Ishan Drops
నేపాల్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో మొదటి 4 ఓవర్లలో 3 క్యాచులను జార విడిచింది భారత జట్టు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అదే తప్పులను రిపీట్ చేసింది...
Shreyas Iyer
తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లోనూ పేలవ ఫీల్డింగ్, టీమిండియాని తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. శ్రేయాస్ అయ్యర్ ఈజీ క్యాచ్‌ని జారవిడచగా, కెఎల్ రాహుల్ ఈజీ రనౌట్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు.
KL Rahul Keeping
9వ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ని శ్రేయాస్ అయ్యర్ జారవిడిచాడు. ఈ క్యాచ్ అందుకుని ఉంటే, శార్దూల్ ఠాకూర్‌కి మొదటి ఓవర్‌లోనే వికెట్ దక్కేది. 14 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు.
కెఎల్ రాహుల్ ఈజీ రనౌట్‌ని జారవిడిచే సమయానికి మార్నస్ లబుషేన్ 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రనౌట్ నుంచ తప్పించుకున్న లబుషేన్, 39 పరుగులు చేశాడు...
Mohammad Kaif
‘సరిగ్గా క్యాచులు పట్టుకోకపోతే, వరల్డ్ కప్‌ని టీమిండియా జారవిడుచుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ బాగుంటే సరిపోదు, క్యాచులు కూడా సరిగ్గా పట్టుకోకపోతే మ్యాచులు గెలవడం కష్టమైపోతుంది..’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...