Image credit: PTI
టీ20ల్లో 7 పరుగులకే 6 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసిన దీపక్ చాహార్, బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ కూడా తీశాడు.. వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్న యజ్వేంద్ర చాహాల్, కొన్ని మ్యాచులను తన బ్యాటింగ్‌తోనూ గెలిపించాడు..
Image credit: PTI
ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో దీపక్ చాహార్ ఇప్పటిదాకా ఆడింది 7 వన్డేలు, 24 టీ20 మ్యాచులు మాత్రమే. చివరిగా 2022 డిసెంబర్‌లో వన్డే మ్యాచ్ ఆడిన దీపక్ చాహార్, గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీ ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాడు..
Image credit: PTI
‘గాయాలు ఏ ప్లేయర్‌ని బాధపెట్టవు, ఎందుకంటే అవి మా చేతుల్లో ఉండవు. అయితే టీమ్‌కి అందుబాటులో ఉండలేకపోతున్నామనే బాధే ఎక్కువగా ఉంటుంది. నాకు అవకాశం వచ్చిన ప్రతీసారీ 100 శాతం ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటా..
నా టైం బాగోలేదని చాలామంది అన్నారు. అయితే గత ఏడాది నేను వెన్నెముక సమస్యతో బాధపడ్డాను. ఫాస్ట్ బౌలర్‌కి వెన్నెముక గాయం చాలా పెద్ద తలనొప్పి. కానీ ఇప్పుడు దాని నుంచి పూర్తిగా కోలుకున్నా..
Image credit: Getty
ఇప్పుడు నా బౌలింగ్ పర్ఫామెన్స్, నాకు సంతృప్తినిచ్చింది. తిరిగి భారత జట్టులోకి రావడం కోసం ఎదురుచూస్తున్నా. ఈ మధ్య రాజస్థాన్ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) ఆడాను. గత ఆదివారం వరకూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉన్నాను..
ఆసియా గేమ్స్ కోసం చైనా వెళ్తున్న భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశా. ఏ ప్లేయర్‌కి అయినా వరల్డ్ కప్ గెలవడానికి మించిన అఛీవ్‌మెంట్ ఉండవు. నేను కూడా ప్రపంచ కప్ ఆడాలని కలలు కన్నాను. నాకు అవకాశం వస్తుందని ఆశించా..
నేను ఆడిన చాలా టోర్నీల్లో టీమిండియా గెలిచింది. 2018లో నా మొదటి ఆసియా కప్‌లో మనమే గెలిచాం. ఆరు ఐపీఎల్ సీజన్లలో ఐదు సార్లు ఫైనల్ ఆడా. అందులో మూడు సార్లు టైటిల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నా..
ధోనీతో నా అనుబంధం క్రికెట్‌కి అతీతమైనది. మహీ భాయ్‌తో కలిసి సమయం గడిపే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అతను నాకు అన్నయ్య, నా ఐడల్. ఓ ప్లేయర్‌గా, ఓ మనిషిగా ఆయనంటే నాకెంతో గౌరవం..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్ దీపక్ చాహార్..