బాబర్ ఆజమ్ ఖాతాలో అరుదైన రికార్డు.. ఇమ్రాన్ ఖాన్ తర్వాత ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌కి..

Published : Sep 22, 2023, 04:19 PM IST

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అరుదైన ఫీట్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ తర్వాత పాక్‌‌కి, వన్డే వరల్డ్ కప్‌లో నాయకత్వం వహించబోతున్న బ్రహ్మాచారి కెప్టెన్ బాబరే..

PREV
18
బాబర్ ఆజమ్ ఖాతాలో అరుదైన రికార్డు.. ఇమ్రాన్ ఖాన్ తర్వాత ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌కి..

28 ఏళ్ల బాబర్ ఆజమ్, 2019 వన్డే వరల్డ్ కప్‌లో ప్లేయర్‌గా పాకిస్తాన్ తరుపున ఆడాడు. నవంబర్ 2020లో పాకిస్తాన్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న బాబర్ ఆజమ్‌కి 2023 వన్డే వరల్డ్ కప్ అసలు సిసలైన ఛాలెంజ్ కానుంది..

28
Shaheen Shah Afridi-Babar in Azam

గత 31 ఏళ్లలో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్‌ జట్టుకి కెప్టెన్సీ చేయబోతున్న రెండో బ్రహ్మాచారి కెప్టెన్ బాబర్ ఆజమ్. ఇంతకుముందు 1992లో ఇమ్రాన్ ఖాన్, పెళ్లికి ముందే పాకిస్తాన్‌ వరల్డ్ కప్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు.. 

38

1992లో ఎలాంటి అంచనాలు లేకుండా వరల్డ్ కప్ ఆడిన పాకిస్తాన్, సంచలన విజయాలతో మొట్టమొదటి, ఏకైక టైటిల్ కైవసం చేసుకుంది. 

48

న్యూజిలాండ్‌తో సెమీస్‌‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్‌ చేరిన ఇమ్రాన్ ఖాన్ టీమ్, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 22 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. ఇమ్రాన్ ఖాన్ తర్వాత పాకిస్తాన్ టీమ్‌కి వరల్డ్ కప్‌లో కెప్టెన్సీ చేసిన ప్లేయర్లు అందరూ పెళ్లైనవాళ్లే..

58
reham khan ex wife of imran khan

1992 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్, ఇప్పటిదాకా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1995లో జెమీమా గోల్డ్‌స్మిత్‌ని వివాహం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్, ఆమెకు 2004లో విడాకులు ఇచ్చేశారు. 

68

2015లో రెహ్మాన్ ఖాన్‌ని పెళ్లాడిన ఇమ్రాన్, అదే ఏడాది ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఐదేళ్లుగా బుహేరా బీబీతో కాపురం చేస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్..

78

1992లో బ్రహ్మాచారి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్‌కి వన్డే వరల్డ్ కప్ అందించడంతో ఈసారి బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోనూ పాకిస్తాన్ ఇదే సీన్ రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్..

88

2022 ఆసియా కప్, 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన పాకిస్తాన్, రన్నరప్‌గా నిలిచింది.. బాబర్‌కి ఈ వన్డే వరల్డ్ కప్‌ అసలైన పరీక్ష కానుంది. 

click me!

Recommended Stories