బిన్నీకి శుభాకాంక్షలు.. దాదాకు అభినందనలు.. కొత్త బీసీసీఐ చీఫ్‌కు స్వాగతం పలుకుతున్న మాజీ క్రికెటర్లు

Published : Oct 18, 2022, 04:09 PM IST

BCCI New President: బీసీసీఐ  36వ అధ్యక్షుడిగా  రోజర్ బిన్నీ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఆయనకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.   ఇదే సమయంలో  పదవీకాలం ముగిసిన దాదాకు అభినందనలు చెబుతూ  మాజీలు ట్వీట్స్ చేస్తున్నారు. 

PREV
16
బిన్నీకి శుభాకాంక్షలు.. దాదాకు అభినందనలు.. కొత్త బీసీసీఐ చీఫ్‌కు స్వాగతం పలుకుతున్న మాజీ క్రికెటర్లు

ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా విరాజిల్లుతున్న  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి  కొత్త అధ్యక్షుడు వచ్చాడు. 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుడు, మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ..  బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా  ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. 

26

బిన్నీ  పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  (హెచ్‌సీఏ) అధ్యక్షుడు  మహ్మద్ అజారుద్దీన్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. అజారుద్దీన్ తో పాటు  టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా బిన్నీకి శుభాకాంక్షలు తెలిపాడు. 

36

ముంబైలో  ముగిసిన ఏజీఎంలో పాల్గొన్న అనంతరం  అజారుద్దీన్ స్పందిస్తూ.. ‘రోజర్ బిన్నీ చాలా మంచి వ్యక్తి.  బిన్నీతో కలిసి నేను క్రికెట్ ఆడాను. నాకు అతడితో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. బిన్నీకి శుభాకాంక్షలు..’ అని తెలిపాడు. 
 

46

ఇదే విషయమై యువరాజ్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన  రోజర్ బిన్నీకి నా శుభాకాంక్షలు.  ఆయన అనుభవం బోర్డుకు ఎంతో ఉపకరించనుందని నేను నమ్ముతున్నాను. ఇదే సమయంలో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు ముగించుకున్న  సౌరవ్ గంగూలీకి నా అభినందనలు..’ అని రాసుకొచ్చాడు. 

56

అజారుద్దీన్, యువరాజ్ తో పాటు భారత క్రికెట్ కు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా   బీసీసీఐ కొత్త బాస్ కు  స్వాగతం పలుకుతున్నారు.  బిన్నీతో పాటు ఇతర పోస్టులకు కూడా బీసీసీఐ కొత్త పేర్లను ప్రకటించింది.  

66

వీరిలో రాజీవ్ శుక్లా (ఉపాధ్యక్షుడు), జై షా (కార్యదర్శి), దేవజిత్ సైకియా (జాయింట్ సెక్రటరీ), ఆశిష్ షేలార్ (ట్రెజరర్) గా ఎంపికయ్యారు.  వీరితో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతినిధులుగా అరుణ్ సింగ్ ధుమాల్, అవిషేక్ దాల్మియా  ఎంపికయ్యారు. 
 

click me!

Recommended Stories