నీకంత సీన్ లేదు, రోహిత్ శర్మను చులకన చేస్తావా; అతను నీకంటే... - డానిష్ కనేరియా...

Published : May 28, 2021, 10:04 AM IST

భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీలను ఈజీగా అవుట్ చేస్తానని పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చేసిన కామెంట్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఫైర్ అయ్యాడు. ఫిక్సింగ్‌కి పాల్పడి, జట్టుకి దూరమైన నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హస్యాస్పదంగా ఉందంటూ కామెంట్ చేశాడు.

PREV
18
నీకంత సీన్ లేదు, రోహిత్ శర్మను చులకన చేస్తావా; అతను నీకంటే... - డానిష్ కనేరియా...

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ప్రస్తుతం ఇంగ్లాండ్ సిటిజన్‌షిప్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు మహ్మద్ అమీర్. పీసీబీతో గొడవల కారణంగా అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన అమీర్, యూఎస్ క్రికెట్ లీగ్‌లో కూడా పాల్గొనాలని ప్రయత్నిస్తున్నాడు.

28

‘రోహిత్ శర్మ గురించి నీకేం తెలుసు. వన్డేల్లో అతను మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్. వరల్డ్ క్లాస్ టాప్ పేసర్లతో పాటు స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ అతను ఈజీగా సిక్సర్లు బాదగలడు.

38

అలాంటి బ్యాట్స్‌మెన్‌కి నువ్వు ఎంత? నీ బౌలింగ్ ఎంత? కేవలం వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతోనే నువ్వు రోహిత్ శర్మ గురించి చులకనగా మాట్లాడావు. ఆ విషయం అందరికీ తెలుసు.

48

అయితే మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడి, జట్టుకు దూరమైన నీకు, ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది. రెండేళ్లుగా సరిగా రాణించలేక, క్రికెట్ నుంచి తప్పుకున్నావు.

58

రోహిత్ శర్మ నీకంటే సీనియర్, నీకంటే ఎక్కువ మ్యాచులు ఆడాడు. అతనో హై క్లాస్ బ్యాట్స్‌మెన్. ప్రతీ బౌలర్‌లాగే నీకు ఓ రోజు లక్కీగా అతని వికెట్ దక్కి ఉండొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.

68

‘రోహిత్ శర్మను అవుట్ చేయడం చాలా తేలిక. అతన్ని అవుట్ చేసేందుకు నా దగ్గర ఒకటికి రెండు ప్లాన్స్ రెఢీగా ఉన్నాయి. రోహిత్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ ఒత్తిడి పరిస్థితుల్లో బాగా ఆడతాడు.

78

విరాట్ కోహ్లీని కూడా అవుట్ చేయడం పెద్దకష్టమేమీ కాదు. ఈ ఇద్దరి కంటే స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేయడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది. అతని బ్యాటింగ్ స్టైల్ విభిన్నంగా ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ అమీర్.

88

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్, 2010లో ఇంగ్లాండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్లు నిషేధానికి గురయ్యాడు. 

click me!

Recommended Stories