దోశలు వేయడం కూడా రాదు, ఇంకెందుకయ్యా నువ్వు.. విజయ్ శంకర్‌ను ఆడుకుంటున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్....

First Published | May 27, 2021, 5:35 PM IST

విజయ్ శంకర్... ఈ మధ్యకాలంలో ఈ క్రికెటర్ ఫేస్ చేసినంత ట్రోలింగ్, మరే క్రికెటర్ ఎదుర్కొని ఉండడేమో. వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో లక్కీగా ఛాన్స్ కొట్టేసిన విజయ్ శంకర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఆడుతున్నాడు. తరుచూ ఫెయిల్ అవుతూ, ఎప్పుడో ఒక్కసారి మెరిసే విజయ్ శంకర్, మరోసారి ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్టాఫ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే రాణించినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది.
మొదటి ఏడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంపులో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను పోస్టు చేసింది ఆరెంజ్ ఆర్మీ.

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్టాఫ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే రాణించినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది.
కిచెన్‌లో డేవిడ్ వార్నర్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, కేన్ విలియంసన్ కలిసి పెసరట్లు వేశారు. డేవిడ్ వార్నర్ పెసరట్టు వేస్తున్న సమయంలో కేన్ మామ వెనకాల నుంచి చెఫ్ క్యాప్ పెట్టాడు. ఆ తర్వాత పెసరట్టు టెస్టు చేసిన కేన్ విలియంసన్, తన చేత్తో పెసరట్టు వేశాడు.
ఈ ఫన్నీ పోటీలో కేన్ విలియంసన్ గెలిచినట్టు ప్రకటించాడు చెఫ్. ఈ వీడియోకి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను...’ అని కామెంట్ చేసిన డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్‌ని ట్యాగ్ చేశాడు. అయితే ఈ వీడియో కూడా విజయ్ శంకర్‌పై ట్రోలింగ్ రావడానికి కారణమైంది.
చెఫ్ పిలవగానే పెసరట్టు వేసేందుకు ముందుకొచ్చిన విజయ్ శంకర్, వేసిన అట్టును తీయడానికి కూడా చాలా కష్టపడ్డాడు. అడ్డదిడ్డంగా గీకుతూ పెసరట్టును చినగకొట్టాడు. దీంతో ఈ వీడియో కింద ‘కనీసం వేసిన దోశ, తీయడానికి కూడా రాదు, ఇంకెందుకు రా నువ్వు’ అంటూ కామెంట్లుపెడుతున్నారు సన్‌రైజర్స్ అభిమానులు.
వారి ఆగ్రహానికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు 2021 సీజన్‌లోనూ సన్‌రైజర్స్ ఓటముల్లో కీలక పాత్ర పోషించాడు విజయ్ శంకర్. ఏ ప్లేయర్ అయినా విజయంలో క్రెడిట్ తీసుకోవాలని చూస్తాడు, కానీ విజయ్ శంకర్‌కి మాత్రం సన్‌రైజర్స్ ఓటముల్లోనే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది.
అటు బ్యాటుతోనూ, ఇటు బాల్‌తోనూ పెద్దగా రాణించని విజయ్ శంకర్, కనీస పరుగులు కూడా చేయకుండా జట్టుకి భారంగా మారాడు. కరోనా వైరస్ బాధితుల కోసం సన్‌రైజర్స్ రూ.30 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి.
జట్టుకి ఏ విధంగానూ ఉపయోగపడనివిజయ్ శంకర్‌కి రూ.3.20 కోట్లు ఇచ్చే బదులు, అతన్ని జట్టులో నుంచి తీసి వేసి ఆ డబ్బులు కూడా కరోనా బాధితుల కోసం సాయం చేయాలని కామెంట్లు చేశారు నెటిజన్లు...
కొన్నిరోజుల క్రితం తనకి భారత జట్టులో చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన విజయ్ శంకర్, తాను బాగా ఆడానని... అయినా ఎందుకు టీమ్‌లో నుంచి తీసేశారో అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు.
తనని అంబటి రాయుడితో పోల్చడం సరికాదని చెప్పిన విజయ్ శంకర్... తాను జాక్వస్ కలీస్, షేన్ వాట్సన్‌లా ఆడగలనని కామెంట్ చేసి ట్రోలింగ్‌ ఎదుర్కొన్నాడు.
అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్‌ను వన్డే వరల్డ్‌కప్ 2019కి ఎంపిక చేశారు సెలక్టర్లు. అతను ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ మూడు విభాగాల్లో జట్టుకి ఉపయోగపడతాడని కామెంట్ చేశాడు ఎమ్మెస్కే ప్రసాద్.
దీంతో 2019 వన్డే వరల్డ్‌కప్ మ్యాచులు చూసేందుకు త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ చేశానంటూ అంబటి రాయుడు చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. అప్పటినుంచి విజయ్ శంకర్‌ను ‘త్రీడీ ప్లేయర్’ అని పిలవడం మొదలెట్టారు నెటిజన్లు.

Latest Videos

click me!