తొలి టెస్టుకు ముందే ఆసీస్‌కు గాయాల బెడద.. కీలక ఆటగాడికి గాయం.. నాగ్‌పూర్‌లో ఆడేది అనుమానమే..!

Published : Jan 09, 2023, 06:46 PM IST

INDvsAUS: స్వదేశంలో వరుసగా టెస్టు, వన్డే సిరీస్ లు గెలిచి జోరుమీదున్న ఆస్ట్రేలియా.. వచ్చే నెలలో భారత్ లో పర్యటించనుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా   టీమిండియాతో నాలుగు టెస్టులు ఆడనుంది. 

PREV
16
తొలి టెస్టుకు ముందే ఆసీస్‌కు గాయాల బెడద.. కీలక ఆటగాడికి గాయం.. నాగ్‌పూర్‌లో ఆడేది అనుమానమే..!

గతేడాది యాషెస్ నుంచి మొదలు స్వదేేశంలో వరుసగా టెస్టు సిరీస్ లు గెలుస్తూ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసును ఖాయం (?) చేసుకున్న  ఆస్ట్రేలియా.. వచ్చేనెలలో భారత్ పర్యటనకు రానుంది.  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  టీమిండియాతో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. 

26

ఆసీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టు ఫిబ్రవరి 9న జరుగనుంది. నాగ్‌పూర్ ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనున్నది. అయితే టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆసీస్ కు భారీ షాక్ తప్పేలా లేదు. ఆ జట్టు కీలక ఆటగాడు, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలి టెస్టు ఆడేది అనుమానంగానే ఉంది. 

36

దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ముగిసిన  టెస్టు సిరీస్ లో భాగంగా.. రెండో టెస్టులో  స్టార్క్ గాయపడ్దాడు. రెండో టెస్టులో  ఫీల్డింగ్ చేస్తుండగా  స్టార్క్ చేతి వేలికి గాయమైంది.  దీంతో అతడు మూడో టెస్టులో ఆడలేదు. అతడు ఇప్పటికీ కోలుకోలేదు. 

46

స్టార్క్ కోలుకోవడానికి సుమారు  నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టొచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే   నాగ్‌పూర్ లో జరిగే తొలి టెస్టు వరకైనా   స్టార్క్ అందుబాటులో ఉంటాడా..? ఉండడా..? అనేది అనుమానంగా మారింది.   

56

స్టార్క్ తో పాటు ఈ టెస్టులో ఆసీస్ యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా గాయపడ్డాడు. అతడు కూడా భారత్ తో తొలి టెస్టు ఆడేది అనుమానమే. అయితే తొలి టెస్టు వరకు తాను  పూర్తి స్థాయిలో కోలుకుంటానని, తర్వాత ఐపీఎల్ లో కూడా బౌలింగ్ చేస్తానని గ్రీన్ ఇటీవలే చెప్పిన విషయం విదితమే. 

66

ఇక  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ భారత్ కు చాలా కీలకం.  నాలుగు మ్యాచ్ లు ఉన్న ఈ సిరీస్ లో భారత్..  ఆసీస్ ను 2-0తో గానీ 3-0  లేదా 3-1తో ఓడిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరే అవకాశముంటుంది. సిరీస్ ఓడినా..  2-2తో డ్రా అయినా భారత్ కు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి.  అప్పుడు  ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి  ఉంటుంది. ఇదిలాఉండగా  ఆస్ట్రేలియా తో సిరీస్ కు భారత జట్టును ఈనెల 19న ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. 

click me!

Recommended Stories