Yashasvi Jaiswal
India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతున్నాయి. అయితే, మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ నాలుగో రోజు భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లను వదిలేశాడు. దీని తర్వాత గ్రౌండ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా కనిపించాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 40వ ఓవర్‌లో ఆకాశ్‌దీప్ వేసిన రెండో బంతికి మార్నస్ లాబుస్‌చాగ్నే క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ వదిలేశాడు.
జైస్వాల్ తొలి మిస్ క్యాచ్ తో పెద్ద నష్టమే జరిగింది
46 పరుగులతో బ్యాటింగ్‌లో ఉన్న మార్నస్ లాబుషాగ్నే క్యాచ్‌ని మిస్ అయ్యాడు. ఈ లైఫ్ ను సద్వినియోగం చేసుకున్న మార్నస్ లాబుషాగ్నే 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సాధారణంగా ప్రశాంతంగా, కంపోజ్‌గా ఉంటాడు, అయితే మార్నస్ లాబుస్‌చాగ్నే వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ జారవిడిచినప్పుడు, అతను తన కోపాన్ని దాచుకోలేకపోయాడు. రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ తర్వాత కోపంతో రగిలి పోయాడు. మార్నస్ లాబుస్‌చాగ్నే క్యాచ్‌ను మిస్ చేసినప్పుడు, ఆస్ట్రేలియా స్కోరు 99 పరుగులకు 6 వికెట్లు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Yashasvi Jaiswal
పాట్ కమిన్స్, ఉస్మాన్ ఖవాజా క్యాచ్‌లను కూడా మిస్ చేసిన జైస్వాల్
మార్నస్ లాబుస్‌చాగ్నే క్యాచ్ తో పాటు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 49వ ఓవర్, మూడో ఓవర్‌లో క్యాచ్‌లు అందుకోవడంలో విఫలమయ్యాడు. యశస్వి జైస్వాల్ 49వ ఓవర్‌లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ క్యాచ్ ఇవ్వగా, మూడో ఓవర్‌లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ లు వచ్చాయి. 49వ ఓవర్‌లో సిల్లీ పాయింట్‌లో పాట్ కమిన్స్ క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ అందుకోలేక పోయాడు. ఆ సమయంలో పాట్ కమిన్స్ 20 పరుగులతో ఆడుతున్నాడు. చివరకు 41 పరుగుల వద్ద పాట్ కమిన్స్ ఔటయ్యాడు.
Rohit Sharma, Virat Kohli, Yashasvi Jaiswal
జైస్వాల్ పై ప్లేయర్ల ఆగ్రహం.. రోహిత్ తీరుపై మాజీల ఫైర్
క్యాచ్ లను జరవిడచడంతో గ్రౌండ్‌లో యశస్వి జైస్వాల్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా కనిపించాడు. రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ తర్వాత కోపంతో గాల్లోకి చేతులు కొట్టడం కనిపించింది. విరాట్ కోహ్లి కూడా కోపంగా కనిపించాడు. ఆకాశ్‌దీప్ యశస్వి జైస్వాల్‌పై కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే, యశస్వి జైస్వాల్ క్యాచ్‌ను మిస్ చేసిన తర్వాత రోహిత్ శర్మ స్పందించిన తీరును ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ మైక్ హస్సీ వ్యతిరేకించాడు. మైక్ హస్సీ మాట్లాడుతూ.. "నిజాయితీగా చెప్పాలంటే, భారత కెప్టెన్ స్పందించిన తీరు నాకు నచ్చలేదు. అయితే అతని మనోభావాలను నేను అభినందిస్తున్నాను. వారు ఇంకా వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది, కానీ మీరు ప్రశాంతంగా, ప్లేయర్లకు మద్దతు ఇవ్వండి. క్యాచ్‌ను వదలాలని ఎవరూ అనుకోరు" అని కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ కూడా జైస్వాల్ కు మద్దతు తెలిపారు. అతను మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అని, అతనికి సీనియర్ ప్లేయర్లు అండగా వుండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ.. బుమ్రా అద్బుత బౌలింగ్
భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 369 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున నితీష్ రెడ్డి అత్యధికంగా 114 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా యశస్వి జైస్వాల్ 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్ తలో 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులతో నాల్గో రోజు ఆటను ముగించింది. దీంతో ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు 333 పరుగుల ఆధిక్యం లభించింది. భారత స్టార్ పేసర్ బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు 4 వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసుకున్నాడు.