భారత్ vs ఆస్ట్రేలియా: 147 ఏళ్ల క్రికెట్ లో తొలి ప్లేయ‌ర్.. జస్ప్రీత్ బుమ్రా స‌రికొత్త రికార్డు

First Published | Dec 29, 2024, 10:27 AM IST

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా త‌న బౌలింగ్ తో అద‌ర‌గొడుతున్నాడు. ఈ క్ర‌మంలో 147 ఏళ్ల క్రికెట్ హిస్ట‌రీలో స‌రికొత్త రికార్డును సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
 

Jasprit Bumrah, india

IND vs AUS: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ప్ర‌స్తుతం భార‌త్-ఆస్ట్రేలియాలు 5 మ్యాచ్ ల టెస్టు  సిరీస్ ను ఆడుతున్నాయి. ఇప్ప‌టికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా, ప్ర‌స్తుతం మెల్ బోర్న్ వేదిక‌గా నాల్గో టెస్టు మ్యాచ్ లో త‌ల‌ప‌డుతున్నాయి. అయితే, భారత స్టార్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాలో సంచలనం రేపుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత టాప్ బౌలర్‌గా తన స్థానాన్ని మ‌రింత సుస్థిరం చేసుకున్నాడు. 8 వికెట్ల ప్రదర్శనతో సహా అద్భుతమైన ప్రారంభంతో తో భారత ప్ర‌ద‌ర్శ‌న‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Jasprit Bumrah

అద్భుత‌మైన బౌలింగ్.. క‌పిల్ దేవ్ ను అధిగ‌మించిన బుమ్రా 

అడిలైడ్‌లో జరిగిన పింక్-బాల్ టెస్ట్‌లో బుమ్రా 4 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత గబ్బాలో తొమ్మిది వికెట్లతో అద‌ర‌గొట్టాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నిలకడగా మెరుపులు మెరిపించాడు. ఇక్క‌డ బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో నలుగురు ఆస్ట్రేలియన్ బ్యాటర్లను అవుట్ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ ఇప్ప‌టివ‌ర‌కు 4 వికెట్లు తీసుకున్నాడు.

ఆస్ట్రేలియాలో బుమ్రా ప్రయాణం 2018/19 సిరీస్‌లో ప్రారంభమైంది. అయితే ఈ ప్రస్తుత పర్యటనలో అతను చరిత్రను తిరగరాశాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కాన్‌స్టాస్‌ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా లెజెండరీ ప్లేయ‌ర్ కపిల్ దేవ్‌ను అధిగమించాడు. అలాగే, 50వ మ్యాచ్‌లో కపిల్ 200వ టెస్టు వికెట్ సాధించగా, బుమ్రా తన 44వ మ్యాచ్‌లోనే ఈ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో భార‌త బౌల‌ర్ గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ 37 మ్యాచ్‌లలో ఈ మార్క్ ను అందుకున్నాడు.


టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి  బౌల‌ర్ గా జ‌స్ప్రీత్ బుమ్రా స‌రికొత్త రికార్డు 

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 20 కంటే తక్కువ సగటుతో 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున తన 44వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా.. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 19.38 సగటుతో 202 వికెట్లు పడగొట్టాడు.

టెస్ట్ క్రికెట్‌లో 200 కంటే ఎక్కువ వికెట్లను తక్కువ సగటుతో తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత వెస్టిండీస్ త్రయం మాల్కం మార్షల్ (376 వికెట్లు, 20.94 సగటు), జోయెల్ గార్నర్ (259 వికెట్లు, 20.97 సగటు). ), కర్ట్లీ ఆంబ్రోస్ (405 వికెట్లు, 20.99 సగటు) ఉన్నారు.

టెస్టు క్రికెట్ లో 200 వికెట్లు తీసిన బుమ్రా 

జ‌స్ప్రీత్ బుమ్రా మెల్ బోర్న్ టెస్టులో మ‌రో మైలురాయికి చేరుకున్నాడు. టెస్టు క్రికెట్ లో 200 వికెట్లు పూర్తి చేశాడు. బుమ్రా తన 200వ టెస్టు వికెట్‌ని తీసుకోవ‌డానికి ముందు కేవలం 3912 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రా కేవలం 8484 బంతుల్లో బౌలింగ్ చేసి త‌న‌ 200వ వికెట్ మార్కుకు చేరుకున్నాడు. దీంతో ఈ ఫీట్‌ను సాధించిన నాలుగో ఫాస్టెస్ట్ బౌలర్ గా నిలిచాడు. వకార్ యూనిస్ (7725), డేల్ స్టెయిన్ (7848), కగిసో రబాడ (8154) మాత్రమే బుమ్రా కంటే ముందున్నారు. మహ్మద్ షమీ 9896 బంతుల్లో 200 వికెట్లు తీసుకున్నాడు.

Jasprit Bumrah

ఒకే సిరీస్ లో 30కి పైగా వికెట్లు తీసిన బౌల‌ర్ గా బుమ్రా రికార్డు 

ప్ర‌స్తుత భార‌త్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఇంకా ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉంది. కాబ‌ట్టి జస్ప్రీత్ బుమ్రా తన రికార్డును మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. ఒకే సిరీస్‌లో 30 వికెట్లకు పైగా క్లెయిమ్ చేసిన ఏకైక భారత పేసర్‌గా ఇప్ప‌టికే ఘ‌న‌త సాధించాడు.  2020/21 ఆస్ట్రేలియా పర్యటనలో అతని ప్రదర్శన అద్భుతంగా సాగింది. 11 వికెట్లు తీశాడు. ఇప్పుడు అద‌రిపోయే బౌలింగ్ లో కొత్త రికార్డులు న‌మోదుచేస్తున్నాడు.

టెస్టు క్రికెట్ లో అత్యుత్తమ బౌలింగ్ సగటుతో 200 వికెట్లు తీసిన బౌలర్లు

జస్ప్రీత్ బుమ్రా (భారత్) - 202 వికెట్లు (19.38 సగటు) 

మాల్కం మార్షల్ (వెస్టిండీస్) - 376 వికెట్లు (20.94)

జోయెల్ గార్నర్ (వెస్టిండీస్) - 259 వికెట్లు (20.97)

కర్ట్లీ ఆంబ్రోస్ (వెస్టిండీస్) - 405 వికెట్లు (20.99)

ఫ్రెడ్ ట్రూమాన్ (ఇంగ్లండ్) - 307 వికెట్లు (21.57)

గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) - 563 వికెట్లు (21.64)

Jasprit Bumrah-Travis Head

2024 లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా 

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బుమ్రా. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 36వ ఓవర్ చివరి బంతికి అలెక్స్ కారీ డిఫెన్స్‌ను బద్దలు కొట్టడం ద్వారా రెండో ఇన్నింగ్స్‌లో తన నాలుగో వికెట్, సిరీస్‌లో ఓవరాల్‌గా 29వ వికెట్‌ను తీసుకున్నాడు. WTC 2023-25లో బుమ్రా 14 మ్యాచ్‌ల్లో మొత్తం 74 వికెట్లు పడగొట్టాడు.

Latest Videos

click me!