ఈ వయసులో దినేశ్ కార్తీక్‌ని అంతపెట్టి కొనడానికి కారణం అదే... అసలు విషయం బయటపెట్టిన ఆర్‌సీబీ కోచ్..

First Published Aug 22, 2022, 12:07 PM IST

37 ఏళ్ల వయసులో దాదాపు క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇచ్చాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడని దినేశ్ కార్తీక్, టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2022లో ఆర్‌సీబీ తరుపున అతనిచ్చిన అదిరిపోయే పర్ఫామెన్స్...

ఐపీఎల్ 2018 నుంచి 2021 వరకూ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన దినేశ్ కార్తీక్, ఆ జట్టుకి ఒకటిన్నర సీజన్లలో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే 2020 సీజన్ మధ్యలో కెప్టెన్సీ పగ్గాలను ఇయాన్ మోర్గాన్‌కి అప్పగించాడు దినేశ్ కార్తీక్..

2018 సీజన్‌లో 16 మ్యాచులు ఆడి 49.8 సగటుతో 498 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఆ తర్వాత మూడు సీజన్లలో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 2020 సీజన్‌లో 169 పరుగులే చేసిన దినేశ్ కార్తీక్, 2021 సీజన్‌లో 17 మ్యాచుల్లో 223 పరుగులే చేశాడు...

దినేశ్ కార్తీక్‌లో టీ20లు ఆడే సత్తా లేదని, అతని టైమ్ అయిపోయిందని అనుకున్నారంతా. ఐపీఎల్ 2022 సీజన్‌లో దినేశ్ కార్తీక్‌ని ఏ జట్టూ కొనుగోలు చేయకపోవచ్చని కూడా కామెంట్లు వినిపించాయి. అయితే అన్యూహ్యంగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.5 కోట్ల 50 లక్షల భారీ మొత్తానికి దినేశ్ కార్తీక్‌ని కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...

‘దినేశ్ కార్తీక్‌ అడవి నుంచి వచ్చినట్టుగా బాగా ఆకలిగా కనిపించాడు. అతన్ని కొనుగోలు చేయడానికి ముందే తననుంచి ఏం ఆశిస్తున్నామో క్లియర్‌గా చెప్పాం. అతను కూడా దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాడు. రిజల్ట్ ఎలా వచ్చిందో అందరూ చూస్తున్నారుగా..

Image credit: PTI

ఐపీఎల్‌లోనే కాదు, టీమిండియా తరుపున అదరగొడుతున్నాడు. మెగా వేలానికి ముందే మేం దినేశ్ కార్తీక్‌ని కలిశాం. అప్పుడే అతనిలో కసి కనిపించింది. ఎలాగైనా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. బాగా ఆడాలనే ఆ ఫైర్ చూసిన తర్వాత ఎలాగైనా అతన్ని కొనుగోలు చేయాలని ఫిక్స్ అయ్యాం...
 

ఇండియన్ ఫినిషర్‌ని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అది కూడా ఇంత అనుభవం ఉన్న దినేశ్ కార్తీక్ లాంటి ఫినిషర్ అయితే ఎంత వెతికినా దొరకడు. ఏబీ డివిల్లియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఆ ప్లేస్‌ని రిప్లేస్ చేయగల కరెక్ట్ ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్ కనిపంచాడు...

దినేశ్ కార్తీక్ ఇలా ఆడతాడని చాలామంది నమ్మరు. అయితే మేం అతన్ని చాలా దగ్గర్నుంచి 15-20 ఓవర్లు చూశాం. మేం వాడిన బౌలర్లను అతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అందుకే అతనికి ఎంత పెట్టడానికైనా ఆర్‌సీబీ సిద్ధమైంది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆర్‌సీబీ హెడ్ కోచ్ మైక్ హస్సెన్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున 55 సగటు, 180+ స్ట్రైయిక్ రేటుతో 330 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, టీమిండియాకి రీఎంట్రీ ఇచ్చి ఆసియా కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.. 

click me!