ధనశ్రీ వర్మ అంతలా ఫీలవ్వడానికి అసలు కారణం ఇదే... విడాకుల రూమర్స్‌పై వివరణ ఇస్తూ...

First Published Aug 21, 2022, 6:11 PM IST

భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ధనశ్రీ వర్మ, తన ఇంటిపేరులో ఉన్న ‘చాహాల్’ని తొలగించడం, దిగులుగా కూర్చున్న ఫోటోలను షేర్ చేసి.. ‘ప్రిన్సెస్ ఎప్పుడూ తన నొప్పిని, పవర్‌గా మార్చుకుంటుంది’ అంటూ కాప్షన్ ఇవ్వడంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది ధనుశ్రీ వర్మ...

Chahal-Dhanasree

‘నా నిజ జీవితం గురించి కొన్ని అప్‌డేట్స్ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను ఈరోజు చాలా లేటుగా లేచా. రాత్రి ఎక్కువగా నిద్ర పోయా. ఎందుకంటే నేను కోలుకోవడానికి నిద్ర చాలా అవసరం, వినడానికి ఫన్నీగా ఉంది కదా. కళ్లు తెరిచే సరికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. 14 రోజులుగా నేను నొప్పితో బాధపడుతున్నా...

Dhanashree Verma

నా మోకాలికి గాయమైంది. నేను డ్యాన్స్ చేస్తున్న సమయంలో నా పాదంపై భారం పడడంతో తీవ్రంగా గాయమైంది. అప్పటి నుంచి నేను ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను చేసిన ఒకే ఒక్క మూమెంట్ బెడ్ మీద నుంచి నా కౌచ్‌ దాకా వెళ్లడం మాత్రమే... అది కూడా థెరపీ కోసమే.. 

ఈ సమయంలో కూడా మా ఆయన నాకు ఎంతో అండగా నిలిచాడు. నా కుటుంబం, సన్నిహితులు తోడుగా నిలిచారు. నేను మళ్లీ డ్యాన్స్ చేయాలంటే సర్జరీ చేయించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఈ వార్త విని నేను షాక్‌కి గురయ్యా. ఇలాంటి సమయంలోనే నాకు నిజమైన అండ, సపోర్ట్ కావాలి. ఎందుకంటే డ్యాన్స్ నాకు ప్రాణం...

అయితే కొందరు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ద్వేషపూరితంగా తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. ఇది నన్ను చాలా బాధపెట్టింది. ఆ మాటలు చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇప్పుడు నాకున్న సమస్యల్లా ఈ గాయమే. గాయానికి సర్జరీ తర్వాత ఎన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలనే భయంతో చాలా రోజులు గడిపేశాను...

ఇప్పుడు భయాన్ని జయించి నిద్రలేచాను. ఇప్పుడు నా భయాన్ని శక్తిగా మార్చుకోవాలని అనుకుంటున్నా. ఎలాంటి పరిస్థితులైనా మార్చగలనన్న నమ్మకం వచ్చింది. నా గాయానికి, అర్థం పర్థం లేని రూమర్లకి భయపడి ఇక్కడే ఆగిపోవడం నాకు ఇష్టం లేదు... 

నిజానికి వీళ్లు చేసిన పని నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నిర్భయంగా ముందుకు వెళ్లేందుకు భరోసా ఇచ్చాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఫేస్ చేసేలా ధైర్యాన్ని నింపాయి. జనాలు ఏమైనా అనుకోని, నేను పట్టించుకోను. నా జీవితాన్ని నేను జీవిస్తా... నిజం ఎప్పుడూ బతికే ఉంటుంది... 

నా వీక్‌నెస్‌ని ధైర్యంగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సంతోషం, ఆనందాలు మాత్రమే పంచుదాం. మిగిలినవన్నీ వదిలేద్దాం...’ అంటూ సుదీర్ఘమైన పోస్టు చేసిన ధనశ్రీ వర్మ... చివరన ‘ధనశ్రీచాహాల్’ అని వచ్చేలా DVC అంటూ సంతకం చేసింది...

ధనశ్రీ వర్మ చేసిన సుదీర్ఘ పోస్టును యజ్వేంద్ర చాహాల్ కూడా షేర్ చేసి ‘లవ్ సింబల్’ జోడించాడు. ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చిన వెంటనే యజ్వేంద్ర చాహాల్‌ వీటిపై స్పందించాడు. తమ వివాహ బంధంపై అనవసర పుకార్లు సృష్టించవద్దని సోషల్ మీడియా ద్వారా వేడుకున్నాడు చాహాల్.. 

click me!