ఇప్పటికైనా ఇండియాని చూసి బుద్ధి తెచ్చుకోండి... ఆఫ్రిదీ గాయంపై పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్...

Published : Aug 21, 2022, 04:16 PM IST

ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీస్ చేర్చిన కీలక బౌలర్ లేకుండానే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోతోంది పాకిస్తాన్. షాహీన్ ఆఫ్రిదీ గాయం కావడంతో పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కాగా, మరోటి 2021లో షాహీన్ ఆఫ్రిదీ గురించి మహ్మద్ అమీర్ చేసిన కామెంట్స్...

PREV
16
ఇప్పటికైనా ఇండియాని చూసి బుద్ధి తెచ్చుకోండి... ఆఫ్రిదీ గాయంపై పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్...
shaheen

షాహీన్ ఆఫ్రిదీ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో మహ్మద్ అమీర్‌ని ఆడిస్తే బాగుంటుందని, అతన్ని ఎలాగైనా రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని పీసీబీని కోరుతున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. దీంతో మహ్మద్ అమీర్ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై స్పందించిన అమీర్ ‘నేను ట్రెండింగ్‌లో ఉన్నా... కానీ ఎందుకు?’ అంటూ పీసీబీని ఇన్‌డైరెక్ట్‌గా ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడు...

26
bowlers

‘టీమిండియా ఫాస్ట్ బౌలర్లను బ్రాండ్‌గా మార్చారు. వాళ్లు దాన్ని చక్కగా వాడుకుంటున్నారు. చూస్తే భారత జట్టులో జస్ప్రిత్ బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్ ఇంకా దేశవాళీ క్రికెట్‌లో చాలా మంది 140+ బౌలింగ్ చేసే బౌలర్లు ఉన్నారు. వాళ్లు ఎన్నో ఏళ్లుగా ఈ బౌలర్లను తయారుచేశారు...

36
shaheen

ఇప్పుడు మూడు ఫార్మాట్లు ఆడేందుకు సరిపడా బౌలర్లు వారి దగ్గర ఉన్నారు. అవసరాలను బట్టి వస్తువులను అభివృద్ధి చేయడం ఎలాగో టీమిండియాని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ, (పాకిస్తాన్‌లో) అలా కాదు. లక్కీగా లాటరీలో ఒకడు దొరికితే... అతన్ని అన్ని ఫార్మాట్లు ఆడిస్తారు. చిన్న దేశాలు, పెద్ద దేశాలు అనే తేడా లేకుండా అన్ని మ్యాచులు ఆడిస్తారు. రొటేషన్ పాలసీ అనే విధానమే లేదు...

46

టీమిండియానే కాదు ఆస్ట్రేలియాని తీసుకున్నా కమ్మిన్స్, హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్... అన్ని మ్యాచులు ఆడరు. సీరిస్‌లో రెండు మ్యాచులు ఆడితే మూడో మ్యాచ్‌లో రెస్ట్ ఇస్తారు. కొందరు టెస్టులు ఆడితే వన్డే, టీ20 సిరీ్‌కి దూరంగా ఉంటారు. బౌలర్లను అలా వాడుకోవాలి...

56
shaheen

షాహీన్ ఆఫ్రిదీని చూస్తే... అతన్ని తెగ వాడేస్తున్నారు. ఇప్పుడు అతను కుర్రాడు. శక్తి ఉంది కాబట్టి ఆడుతున్నాడు. 26 దాటిన తర్వాత అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండడం కష్టంగా మారుతుంది. కావాలంటే కొన్ని రోజపుల తర్వాత ఈ విషయాన్ని గ్రహించి... నా దగ్గరికే వస్తారు చూడండి...’ అంటూ ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్లు చేశాడు మహ్మద్ అమీర్...

66
shaheen

మహ్మద్ అమీర్ అంచనా వేసినట్టే ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు నెదర్లాండ్స్ సిరీస్‌లో పాల్గొన్న షాహీన్ ఆఫ్రిదీ... గాయంతో కీలక టోర్నీకి దూరమయ్యాడు. 29 ఏళ్ల వయసులో పీసీబీతో విభేదాలతో అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు మహ్మద్ ఆఫ్రిదీ. అతను కమ్‌బ్యాక్ ఇస్తాడని ప్రచారం జరుగుతున్నా... రెండేళ్లుగా అది కార్యరూపం దాల్చలేదు.

click me!

Recommended Stories