మైకేల్ వాన్ - వసీం జాఫర్.. ఇది వొడువని ముచ్చట.. మళ్లీ గిల్లుకున్న క్రికెట్ వెటరన్స్

Published : Mar 28, 2022, 03:20 PM IST

Michael Vaughan-Wasim Jaffer: భారత వెటరన్ బ్యాటర్ వసీం జాఫర్, ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ మధ్య ట్విట్టర్ వార్ కు శుభం కార్డు పడే సందర్భాలు కనబడటం లేదు.  ఎప్పుడూ ఏదో విషయం మీద గిల్లుకునే  ఈ ఇద్దరు  ఆటగాళ్లు తాజాగా.... 

PREV
17
మైకేల్ వాన్ - వసీం జాఫర్.. ఇది వొడువని ముచ్చట.. మళ్లీ గిల్లుకున్న క్రికెట్ వెటరన్స్

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ టీ20లతో పాటు టెస్టులలో కూడా దారుణ ఓటమిని మూటగట్టుకున్నది. రెండు టెస్టులు డ్రా కాగా.. నిర్ణయాత్మక  మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పై విండీస్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

27

అయితే ఇంగ్లాండ్ కు యాషెస్ తర్వాత మరో అవమానకర ఓటమి ఎదురైన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా వసీం జాఫర్ స్పందించాడు.  గతేడాది ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో  మూడో స్థానంలో ఉన్న ‘అదనపు పరుగులు’ జాబితా (జో రూట్ 1,708 రన్స్, రోరీ బర్న్స్ 530, ఎక్స్ట్రాలు 412) సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు.

37

‘ఇంగ్లాండ్ 120 ఆలౌట్.  ఏమైంది మైకేల్ వాన్. ఈ ఎక్స్ట్రా  రన్స్ కొట్టిన ఆటగాడు ఐపీఎల్ లో ఆడుతున్నాడా ఎట్ల..? లేక అతడు అందుబాటులో లేడా..?’ అని  ట్వీట్ చేశాడు.  

47

దీనికి మైకేల్ వాన్ కూడా ధీటుగా రిప్లై ఇచ్చాడు. ‘వసీం.. ఈ సమయంలో మేము మహిళల ప్రపంచకప్ సెమీస్ మీద దృష్టి సారించాం’ అని  ట్వీట్ లో రాసుకొచ్చాడు. 

57

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో  దక్షిణాఫ్రికాతో జరిగిన  మ్యాచులో భారత జట్టు ఓడి ఇంటి బాట పట్టగా.. ఇంగ్లాండ్  మాత్రం బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే  వాన్ ట్వీట్ చేశాడు. 

67

వీళ్ల ట్విట్టర్ వార్ ఏమో గానీ రెండు దేశాల అభిమానులకు మాత్రం ఈ వెటరన్ ఆటగాళ్లు కావాల్సినంత ఫన్ ను పంచుతున్నారు. 

77

ఇక విండీస్ తో ఇంగ్లాండ్ మూడో టెస్టు గురించి చెప్పుకుంటే.. తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగులు చేసిన  రూట్ సేన రెండో ఇన్నింగ్స్ లో 120కే ఆలౌటైంది. విండీస్ ముందు 27 పరుగులు లక్ష్యాన్ని నిలిపింది. ఈ లక్ష్యాన్ని విండీస్ ఆడుతూ పాడుతూ సాధించి టెస్టుతో పాటు సిరీస్ ను కూడా గెలుచుకుంది. 

click me!

Recommended Stories