సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్ సాగిందిలా..
మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ మంచి ప్రారంభమే అందించారు. హెడ్ తన స్టైల్ కు భిన్నంగా మెల్లగా ఆడాడు... అతడు 29 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేసాడు. ఇలా ఎక్కువ బంతుల్లో తక్కువ పరుగులు చేయడం హెడ్ కెరీర్ లోనే ఇదే మొదటిసారి కావచ్చు.
ఇక మొదటిమ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ తర్వాత తేలిపోతున్నాడు. గత నాలుగైదు మ్యాచుల్లో అతడు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతున్నాడు. ఈసారి కూడా కేవలం 2 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. మధ్యలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డితో కలిసి క్లాసేన్ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేసాడు. నితీష్ 21 బంతుల్లో 19 పరుగులు, క్లాసేన్ 28 బంతుల్లో 37 పరుగులు చేసారు. చివర్లో కమిన్స్ కేవలం 4 బంతులాడి 8 పరుగులు చేసాడు.
59 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయింది. 68 పరుగులకు రెండోది, 82 పరుగులకు మూడోది, 113 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయారు. 136 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోగా అనికేత్ వర్మ, కమిన్స్ చివర్లో మెరుపు బ్యాటింగ్ చేయడంతో 163 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై ముందు ఉంచగలిగారు.