IPL 2025 Super Over : తొలి సూపర్ ఓవర్... మిచెల్ స్టార్క్ పైసా వసూల్ హీరో

DC vs RR - IPL 2025 Super Over: ఐపీఎల్ 2025లో తొలి సూపర్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ‌ధ్య జరిగింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ లో అక్ష‌ర్ ప‌టేల్ కెప్టెన్సీలో ఢిల్లీ గెలిచింది. ఈ మ్యాచ్ గెలుపులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిచెల్ స్టార్క్ గురించి. అద్భుత‌మైన బౌలింగ్ తో పైసా వ‌సూల్ అనిపించేలా మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చిప‌డేశాడు.

DC vs RR: IPL 2025 First Super Over... Mitchell Starc is a Paisa Vasool hero in telugu rma
Mitchell Starc

DC vs RR IPL 2025 Super Over: ఐపీఎల్ అంటేనే ఊహించ‌నీ, అసాధ్యం అనుకున్న‌వి సుసాధ్యం చేసే క్రికెట్ లీగ్ గా మారింది. చివ‌రి బంతి వ‌ర‌కు మ్యాచ్ ఏ టీమ్ వైపుకైనా వెళ్ల‌వ‌చ్చు. అలాంటివి చాలానే జ‌రిగాయి. ఇప్పుడు అదేతరహా మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జ‌రిగింది. చివ‌రి బంతిలో కూడా ఫలితం రాలేదు. రెండు జ‌ట్లు స‌మంగా నిలిచాయి. దీంతో ఐపీఎల్ 2025లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్ అభిమానుల‌కు థ్రిల్లింగ్ ఫీస్ట్ ను అందించింది. అదే ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్. 

DC vs RR: IPL 2025 First Super Over... Mitchell Starc is a Paisa Vasool hero in telugu rma
Mitchell Starc. (Photo- IPL)

ఈ మ్యాచ్‌లో ట్రిపుల్ డోస్ ఉత్కంఠ కనిపించింది. ఎందుకంటే ఐపీఎల్ 2025లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ ఇది. విజ‌యం కోసం రెండు జట్ల మధ్య గట్టి పోటీ కనిపించింది. అయితే, ఈ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ హీరోగా నిలిచాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో మ‌రోసారి అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. పైసా వ‌సూల్ షో చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు థ్రిల్లింగ్ విక్ట‌రీని అందించాడు. రాజస్థాన్ నోట్లో నుంచి గెలుపును ఢిల్లీ కోసం లాక్కున్నాడు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. 


Mitchell Starc (Photo: IPL)

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కోసం అభిషేక్ పోరెల్ 49 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, అక్షర్ పటేల్ 38 ప‌రుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 34 ప‌రుగులు, కేఎల్ రాహుల్ 38 ప‌రుగులు ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌టంతో ఢిల్లీ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసుకోగా, హసరంగా, తీక్షణ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 

Mitchell Starc

189 ప‌రుగుల టార్గెట్ తో రెండో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్, సంజూ శాంస‌న్ లు అద్భుత‌మైన ఆరంభం అందించారు. ఢిల్లీ మ‌రోసారి చెత్త ఫీల్డింగ్ తో వ‌రుస‌గా చాలా క్యాచ్‌లు మిస్ చేశారు. రాజస్థాన్ యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగుల త‌న ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. నితీష్ రాణా కూడా 51 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను వ‌న్ సైడ్ చేశాడు. కానీ, మిచెల్ స్టార్క్ అద్భుత‌మైన బౌలింగ్ తో చివరి 3 ఓవర్లలో ఢిల్లీ తిరిగి పుంజుకుని మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లింది. 

17వ ఓవ‌ర్ లో మోహిత్ శ‌ర్మ 13 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. అప్ప‌టికీ రాజస్తాన్ కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 158 ప‌రుగులు చేసింది. నితీష్ రాణా 50 ప‌రుగులు, ధ్రువ్ జురేల్ 13 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. గెలుపు ఖాయంగానే కనిపించింది. 18వ ఓవ‌ర్ ను మిచెల్ స్టార్క్ వేయ‌డానికి వ‌చ్చాడు. ఈ ఓవ‌ర్ లో  కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి సూపర్ ఫామ్ లో లఉన్న నితీష్ రాణాను అవుట్ చేసి ఢిల్లీలో గెలుపు ఆశ‌లు పెంచాడు. 19వ ఓవ‌ర్ లో మ‌ళ్లీ 14 ప‌రుగులు రావ‌డంతో మ్యాచ్ రాజ‌స్థాన్ ను చెంత‌కు చేరింది. 

రాజస్థాన్ విజయానికి కేవలం 9 పరుగులు మాత్రమే అవసరమైనప్పుడు ఢిల్లీ తరపున చివరి ఓవర్ వేయడానికి మిచెల్ స్టార్క్ వచ్చాడు. స్టార్క్ వ‌రుస యార్క‌ర్ల‌తో ఆర్ఆర్ బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్టాడు. మొద‌టి 5 బంతుల్లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. సంజూ శాంస‌న్ టీమ్ గెల‌వాలంటే చివ‌రి బంతికి 2 ప‌రుగులు కావాలి. చివ‌రి బంతిని సూప‌ర్ ఫుల్ డెలివ‌రి వేశాడు. ఫ‌స్ట్ ర‌న్ పూర్తి చేసుకుని రెండో ప‌రుగు తీసే క్ర‌మంలో ధ్రువ్ జురేలో ర‌నౌట్ అయ్యాడు.  రాజస్థాన్ కూడా 188 ప‌రుగులు చేయ‌డంతో మ్యాచ్ టైగా మారింది. దీంతో ఐపీఎల్ 2025లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ వ‌చ్చేలా అద్భుత‌మైన బౌలింగ్ వేశాడు మిచెట్ స్టార్క్.

Mitchell Starc (Photo: IPL)

సూపర్ ఓవర్‌లో కూడా మిచెల్ స్టార్క్ అద్భుతం చేశాడు. సూప‌ర్ ఓవ‌ర్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. దీంతో రాజ‌స్థాన్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది.  ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్, మెక్‌గుర్క్ కేవలం 3 బంతుల్లోనే మ్యాచ్‌ను గెలిచారు.

ఐపీఎల్ 2025 లో తొలి సూపర్ ఓవర్ ఎలా సాగిందంటే.. 

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇన్నింగ్స్

మిచెల్ స్టార్క్ వేసిన మొదటి బంతి - ఒక్క పరుగు కూడా రాలేదు.
రెండవ బంతి - హెట్మెయర్ ఫోర్ కొట్టాడు.
మూడో బంతికి హెట్మెయర్ సింగిల్ తీసి రియాన్ పరాగ్ కు స్ట్రైక్ ఇచ్చాడు.
4వ బంతి (నో బాల్) – ర్యాన్ ఫోర్ కొట్టాడు.
4వ బంతి (ఫ్రీ హిట్) - రియాన్ పరాగ్ రనౌట్ అయ్యాడు.

ఐదవ బంతికి - రెండవ పరుగు తీసే ప్రయత్నంలో హెట్మెయర్ రనౌట్ అయ్యాడు. ఒక పరుగు సాధించగా రెండో ప‌రుగు స‌మ‌యంలో రాజస్థాన్ జట్టు ఆలౌట్ అయింది. 

సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిట్స్ ఇన్నింగ్స్ 

సందీప్ శర్మ వేసిన మొదటి బంతికి - కెఎల్ రాహుల్ రెండు పరుగులు తీసుకున్నాడు. 
రెండవ బంతికి - రాహుల్ అద్భుతమైన ఫోర్ కొట్టాడు.
మూడో బంతి - రాహుల్ సింగిల్ తీసుకుని ట్రిస్టన్ స్టబ్స్ కు స్ట్రైక్ ఇచ్చాడు.
నాలుగో బంతి - స్టబ్స్ సిక్స్ కొట్టి ఢిల్లీకి విజయం అందించాడు. 

Latest Videos

vuukle one pixel image
click me!