స్టార్ బౌలింగ్ దెబ్బతో తొలుత మ్యాచ్ ను టై కాగా, ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అద్భుతంగా ఛేదించింది. కేఎల్ రాహుల్, ట్రిస్టాన్ స్టబ్స్ కేవలం నాలుగు బంతుల్లోనే విజయాన్ని సాధించారు. అక్షర్ పటేల్ ఇంకా మాట్లాడుతూ.. పవర్ ప్లే సమయంలో ఢిల్లీ అంచనాలను అందుకోలేకపోయిందని అన్నాడు. తాము అనుకున్న పరుగులు రాలేదని తెలిపాడు.
"ఆరంభంలోనే ఎక్కువ స్కోర్ చేసి ఉండాల్సింది. పిచ్ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని కెఎల్ రాహుల్ అన్నారు. అయితే, సానుకూలంగా ఉండి, తమ లక్ష్యాన్ని చూపించాలని నేను గుర్తు చేశాను. కొన్నిసార్లు, ఒత్తిడి మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తుంది. ఆర్‌ఆర్ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, నేను ఆ వేడిని అనుభవించాను. అందుకే బౌలర్లను సరైన లైన్, లెంగ్త్ బౌలింగ్ మాత్రమే వేయాలని కోరాను" అని చెప్పాడు.
మ్యాచ్ గెలుచుకున్నాము కానీ, తాము ఇంకా మెరుగైన బ్యాటింగ్ చేయాల్సిందని అక్షర్ పటేల్ అన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో అనుకున్న విధంగా పరుగులు చేయడంలో సక్సెస్ కాలేదని తెలిపాడు. కానీ, 12, 13 ఓవర్ లో జోరు పెంచడం మ్యాచ్ లో కీలకంగా మారిందని అన్నాడు.