MI vs RCB: రెచ్చిపోయిన కోహ్లీ, పాటిదార్‌.. ముంబై టార్గెట్‌ ఎంతో తెలుసా.?

Published : Apr 07, 2025, 09:33 PM IST

ఐపీఎల్‌ 2025లో వాంఖడే స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బ్యాటర్లు చెలరేగారు. విరాట్‌ కోహ్లీ, పాటిదార్‌ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు. మరి ముంబై ఈ టార్గెట్‌ను అధిగమిస్తుందా, ఇంతకీ ముంబై విజయానికి ఎన్ని పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
13
MI vs RCB: రెచ్చిపోయిన కోహ్లీ, పాటిదార్‌.. ముంబై టార్గెట్‌ ఎంతో తెలుసా.?
MI vs RCB

సోమవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 221 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై టీమ్‌ బెంగళూరు బౌలర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారని చెప్పాలి. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.

23
MI vs RCB

బెంగళూరు టీమ్‌లో విరాట్ కోహ్లీ 67 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 42 బంగుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లను బాదాడు. ఇక రజత్‌ పటీదార్‌ సైతం తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం 32 బంతుల్లోనే ఏకంగా 64 పరుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉండడం విశేషం. ఇక ఇతర బ్యాటర్ల విషయానికొస్తే దేవదత్ పడిక్కల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు సాధించాడు. అలాగే జితేశ్ శర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. 
 

33
Rajat Patidar. (Photo- IPL)

ఇక ముంబై ఇండియన్‌ బౌలింగ్ విషయానికొస్తే. హార్ధిక్‌ పాండ్యా 2 వికెట్లు పడగొట్టి 45 పరుగులు అంధించాడు. ట్రెంట్,  బౌల్ట్ రెండేసి వికెట్లు తీయగా.. విజ్ఞేష్ పుతుర్‌కు ఓ వికెట్ దక్కింది. జస్‌ప్రీత్ బుమ్రా వికెట్‌ తీయకపోయినా కేవలం 29 పరుగులు ఇచ్చిన ఆర్‌సీబీ స్కోర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే ముంబై బౌలింగ్ ఆశించిన స్థాయిలో ఏమాత్రం లేదని అభిప్రాయాలు వస్తున్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories