Image Credit: ANI
Hardik Pandya 5 Wickets : లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 16వ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు సాధించాడు. అతని కంటే ఐపీఎల్ లో ఎవరూ ఈ రికార్డును సాధించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆకాశ్‌దీప్‌ను పెవిలియన్‌కు పంపడంతో హార్దిక్ ఈ ఘనత సృష్టించాడు.
Hardik Pandya. (Photo: IPL)
హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో !
లక్నో తో జరిగిన మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో చూపించాడు. బౌలింగ్ లో 5 వికెట్లతో పాటు బ్యాటింగ్ లో 28 పరుగులు నాటౌట్ ఇన్నింగ్స్ ను ఆడాడు. హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ 5 వికెట్లు తీసుకోవడం ఇదే తొలి సారి. మొత్తంగా తన టీ20 కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్లు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, హార్దిక్ బంతితో అద్భుతంగా రాణించాడు. తన 4 ఓవర్లలో 36 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, రిషబ్ పంత్ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆకాశ్‌దీప్ అతని 5వ వికెట్.
Image Credit: TwitterMumbai Indians
టీ20 క్రికెట్ లో హార్దిక్ పాండ్యా బెస్ట్ బౌలింగ్ రికార్డులు
5/36 vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో, 2025
4/16 vs న్యూజిలాండ్, అహ్మదాబాద్, 2023
4/33 vs ఇంగ్లాండ్, సౌతాంప్టన్, 2022
4/38 vs ఇంగ్లాండ్, బ్రిస్టల్, 2018
rohit sharma and hardik pandya
16 ఏళ్ల చరిత్రను మార్చేసిన హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా 5 వికెట్లు పడగొట్టడం ద్వారా 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రను తిరగరాశాడు. కెప్టెన్‌గా ఒకే ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. అతను 2009లో డెక్కన్ ఛార్జర్స్‌పై 16 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఈ రికార్డును బద్దలు కొట్టాడు. 5/36 వికెట్లతో హార్దిక్ కెప్టెన్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా బెస్ట్ బౌలింగ్ రికార్డులు
5/36 - హార్దిక్ పాండ్యా vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో, 2025
4/16 - అనిల్ కుంబ్లే vs డెక్కన్ ఛార్జర్స్, జోహన్నెస్‌బర్గ్, 2009
4/16 - అనిల్ కుంబ్లే vs డెక్కన్ ఛార్జర్స్, నవీ ముంబై, 2010
4/17 - జేపీ డుమినీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, వైజాగ్, 2015
4/21 - షేన్ వార్న్ vs డెక్కన్ ఛార్జర్స్, నాగ్‌పూర్, 2010