నీ దిక్కుమాలిన తెలివితో, మా పరువు కూడా తీస్తున్నావ్! హసన్ రాజాపై వసీం అక్రమ్ సీరియస్..

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు వరుసగా 7 మ్యాచుల్లో గెలిచి సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత జట్టు అత్యద్భుత ప్రదర్శన కనబరుస్తోంది..

ICC World cup 2023:  getting yourself insulted and Insulting us, Wasim Akram slams hasan raza CRA

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా, ఓ టీవీ షోలో భారత జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేశాయి. ‘భారత బౌలర్లకు ఐసీసీ వేరే బాల్స్ ఇస్తున్నట్టు ఉంది. లేకపోతే మిగిలిన బౌలర్లు ఫెయిల్ అవుతుంటే, వీళ్లు మాత్రం ఇలా ఎలా వికెట్లు తీస్తున్నారు?’ అంటూ వ్యాఖ్యానించాడు హసన్ రాజా..

ICC World cup 2023:  getting yourself insulted and Insulting us, Wasim Akram slams hasan raza CRA
Team India

హసన్ రాజా కామెంట్లపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌ తీవ్రంగా స్పందించాడు. ‘హసన్ రాజా చేసిన కామెంట్ల గురించి విన్నాను. నాకు తెలిసి వీళ్లు ఫన్నీగా ఇలాంటి కామెంట్లు చేసినట్టు ఉన్నారు..


Shami

ఎందుకంటే వాళ్లకు బుర్ర లేదు. నీ కామెంట్ల వ్లల నీ పరువు తీసుకుంటే పర్లేదు, మా పరువు (పాకిస్తాన్ క్రికెటర్ల) కూడా ఎందుకు తీస్తున్నావ్? ప్రపంచ వేదిక మీద ఇలాంటి కామెంట్లు చేయడం వాళ్ల దిక్కుమాలిన తెలివే..

ఇది చాలా సింపుల్ విషయం. అంపైర్లు, మ్యాచ్ ప్రారంభమవ్వడానికి ముందే వస్తారు. టాస్ దగ్గర్నుంచి ప్రతీ విషయం కెమెరాలో రికార్డు అవుతుంది. 12 బాల్స్ ఉంటే బాక్సు నుంచి ఒక బాల్ తీసుకుంటారు. 

ఒక్క అంపైర్‌ని కొన్నారని అనుకున్నా, ఒక్కో మ్యాచ్‌కి నలుగురు అంపైర్లు ఉంటారు. రిఫరీ ఉంటాడు. ఇంకా చాలా మంది టెక్నీషియన్లు, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. 12 బంతుల్లో ఏ బాల్ వేయాలనేది అంపైరే డిసైడ్ చేస్తాడు..

ss

బంతి పరిమాణం, సైజు అన్నీ అంపైర్లే చెక్ చేస్తారు. నాలుగు బాల్స్ వాడి, మిగిలిన 8 బంతులను డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకెళ్తారు. పాక్ బౌలర్లు, స్వింగ్ రాబట్టలేకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నారు...

Siraj

ఇండియాలో పిచ్‌లు, పాకిస్తాన్‌ పిచ్‌ల మాదిరిగా ఉండవు. నేను కూడా ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. ఇండియాలో ఆడితే పాక్ బౌలర్లు మరింత మెరుగవుతారు. భారత బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. బాగా రాణిస్తున్నారు..

Siraj


మణికట్టు పొజిషన్‌పైన, సీమ్ పొజిషన్‌పైన ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే బౌలింగ్‌ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇండియాలో ఆడుతున్నవాళ్లకు ఇది పెద్ద విషయం కాదు.

Bumrah-Shami-Siraj

మిగిలిన వాళ్లకు ఇక్కడి పిచ్‌ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్.. 

Latest Videos

vuukle one pixel image
click me!