Highest Scores On ODI Debut : రోహిత్ శర్మ కంటే ప్రమాదకరమైన ఆటగాడు దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ యంగ్ ప్లేయర్ తన అరంగేట్రంలోనే 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
Matthew Breetzke: ఆధునిక క్రికెట్‌లో మరీ ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు క్రికెట్ రాజులుగా వెలుగొందుతున్నారు. వీరిద్దరూ క్రికెట్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు అనేక రికార్డులు సాధించారు. వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి.
అయితే, ఇప్పుడు రోహిత్ కంటే ప్రమాదకరమైన ఆటగాడు దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ ఆటగాడు తన అరంగేట్రంలోనే 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఆటగాడు లాహోర్‌లో న్యూజిలాండ్‌పై అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సాధించాడు.
25
Image Credit: Twitter/ICC
మాథ్యూ బ్రీట్జ్కే తొలి మ్యాచ్ తో ప్రపంచ రికార్డు సాధించాడు
ప్రస్తుతం దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ లు ముక్కోణపు సిరీస్ ఆడుతున్నాయి. లాహోర్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో మాథ్యూ బ్రీట్జ్కే దక్షిణాఫ్రికా తరపున ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. ఈ యంగ్ ప్లేయర్ తన అరంగేట్రంలోనే న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టాడు.
మాథ్యూ బ్రీట్జ్కే కేవలం 148 బంతుల్లో 150 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. దీంతో అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతను గొప్ప రికార్డు సృష్టించాడు. ఏ ఆటగాడూ తన అరంగేట్రంలో 150 పరుగుల మార్కును అందుకోలేదు.
35
Matthew Breetzke
వెస్టిండీస్ లెజెండ్ రికార్డును బద్దలు కొట్టిన మాథ్యూ బ్రీట్జ్కే
మాథ్యూ బ్రీట్జ్కే కంటే ముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ డైమండ్ హేన్స్ పేరిట ఉంది. 1978లో ఆస్ట్రేలియాపై 148 పరుగులు చేశాడు. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఈ 26 ఏళ్ల ఆటగాడు చాలా సంవత్సరాల తర్వాత ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా, న్యూజిలాండ్ జట్టు స్కోరు బోర్డుపై 304 పరుగులు చేసింది.
45
Matthew Breetzke
వన్డేల్లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు
వన్డే అరంగేట్రానికి ముందు మాథ్యూ బ్రీట్జ్కే దక్షిణాఫ్రికా తరపున ఒక టెస్ట్, 10 T20Iలు ఆడాడు. అయితే, ఆ గణాంకాల గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నెమ్మదిగా తన ఇన్నింగ్స్ లు ప్రారంభం అయినప్పటికీ, దక్షిణాఫ్రికా అతనిపై నమ్మకం ఉంచి ముక్కోణపు సిరీస్ కోసం జట్టులోకి తీసుకుంది. దక్షిణాఫ్రికా దేశీయ క్రికెట్‌లో వారియర్స్ తరపున మాథ్యూ బ్రీట్జ్కే ఆడుతున్నాడు. SA20 2024లో 50 కంటే ఎక్కువ సగటుతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అతను టాప్, మిడిల్ ఆర్డర్‌లో ఆడగల బ్యాట్స్‌మన్.
SA20 లో అదరిపోయే ఇన్నింగ్స్ లతో అతను ఐపీఎల్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ బ్యాట్స్‌మన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ INR 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ వంటి అనేక మంది దక్షిణాఫ్రికా దిగ్గజాలు ఈ యువకుడి గురించి గొప్పగా మాట్లాడారు. డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేశవ్ మహారాజ్ కూడా అతన్ని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పోల్చాడు.