విరాట్-సచిన్ సహా అనేక మంది దిగ్గజాలను వెనక్కి నెట్టిన కేన్ విలియమ్సన్
వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేయడంలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలను విలియమ్సన్ అధిగమించాడు. ఈ ఫార్మాట్‌లో 7000 పరుగులు చేరుకోవడానికి అతను 159 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, కోహ్లీ 161, సచిన్ డూల్కర్ 189 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా 150 ఇన్నింగ్స్‌లలో 7000 పరుగులు పూర్తి చేసి టాప్ లో ఉన్నాడు. విలియమ్సన్ కంటే ముందు, 7000 వన్డే పరుగులు వేగంగా అందుకున్న కీవీస్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్, అతను 186 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు.