India Tour Of South Africa: కీలక పర్యటన నిమిత్తం భారత జట్టు దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ టూర్ లో టీమిండియా పేస్ గుర్రం.. సౌతాఫ్రికాకు చుక్కలు చూపెట్టడం ఖాయమని అంటున్నాడు భారత మాజీ ఆటగాడు జహీర్ ఖాన్.
మరో నాలుగు రోజుల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మేరకు అక్కడి పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు ఎలాగైనా అక్కడ సిరీస్ గెలవాలని నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది.
27
అయితే ఈసారి దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లతో అంత వీజీ కాదంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్. మరీ ముఖ్యంగా భారత పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రాతో దక్షిణాఫ్రికాకు కష్టమేనని అంటున్నాడు.
37
జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘మనకు బుమ్రా ఉన్నాడు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. తన పేస్ తో అతడు దక్షిణాఫ్రికా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టబోతున్నాడు. ఇటీవలి కాలంలో భారత జట్టు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ల మీద గెలిచింది.
47
ఈ పర్యటనలలో బుమ్రా తన పేస్ బౌలింగ్ తో అక్కడి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అందరూ అతడిని వైట్ బాల్ (వన్డే, టీ20) కే పరిమితం చేస్తారు గానీ అతడు అన్ని ఫార్మాట్లకు సరిపోయే బౌలర్..’ అని బుమ్రాను కొనియాడాడు.
57
ఇక బుమ్రానే గాక భారత పేస్ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉందని జహీర్ అన్నాడు. టెస్టులలో 20 వికెట్లు తీయగల సామర్థ్యమున్న బౌలర్లు మనజట్టులో కూడా ఉన్నారని జహీర్ తెలిపాడు.
67
‘ప్రతి టెస్టులో 20 వికెట్లు తీయగల బౌలర్లు మనకు కూడా ఉన్నారు. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు. బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మల రూపంలో మనకు మంచి బౌలింగ్ అటాక్ ఉంది.
77
ప్రపంచ స్థాయి బ్యాటర్లను బోల్తా కొట్టించే పేసర్లు మనకున్నారు. ఇషాంత్ శర్మ అదనపు పేస్ రాబట్టడంలో దిట్ట. ఇక లెంగ్త్ తో బౌలింగ్ చేయడంలో షమీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు...’ అని చెప్పాడు.