స్టీవ్ స్మిత్ కంటే అతనితోనే టీమిండియాకి ఢేంజర్... మార్నస్ లబుషేన్‌పై ఇర్ఫాన్ పఠాన్...

Published : Feb 05, 2023, 11:59 AM IST

రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం చూపించింది ఆస్ట్రేలియా. ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన టీమ్ భారత జట్టే.ఇప్పుడు టెస్టుల్లో టాప్‌ టీమ్‌గా కొనసాగుతోంది ఆస్ట్రేలియా... ఇప్పుడు కూడా టీమిండియాతోనే ఆసీస్ టాప్ ర్యాంకుకు చెక్ పడే అవకాశం ఉంది. టెస్టు సిరీస్‌ని 3-0 తేడాతో కోల్పోతే ఆస్ట్రేలియా టాప్ ర్యాంకు కూడా చేజారుతుంది...

PREV
16
స్టీవ్ స్మిత్ కంటే అతనితోనే టీమిండియాకి ఢేంజర్... మార్నస్ లబుషేన్‌పై ఇర్ఫాన్ పఠాన్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కి చేరువైన ఆస్ట్రేలియా, రెండో స్థానంలో ఉన్న టీమిండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది... టెస్టుల్లో స్టీవ్ స్మిత్ స్టైల్‌లో అదరగొడుతున్న మార్నస్ లబుషేన్, టెస్టుల్లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు...

26
Steve Smith and Marnus Labuschagne

 

2017లో భారత్‌లో పర్యటించిన సమయంలో స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 4 టెస్టుల్లో 3 సెంచరీలతో 499 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, ఆసీస్ తరుపున బ్యాటింగ్‌లో ఒంటరి పోరాటం చేశాడు...
 

36
Marnus Labuschagne

అయితే ఈసారి స్టీవ్ స్మిత్‌తో పాటు మార్నస్ లబుషేన్, టీమిండియాని ఇబ్బందిపెట్టే అవకాశాలున్నాయి. ఆసియా ఉపఖండంలో లబుషేన్‌కి మంచి రికార్డు ఉంది... 

46
Marnus Labuschagne with Travis Head

‘స్టీవ్ స్మిత్‌తో పాటు మార్నస్ లబుషేన్ కూడా టీమిండియాని ఇబ్బందిపెడతాడు. స్టీవ్ స్మిత్ కంటే లబుషేన్ బ్యాటింగ్‌లో టెక్నిక్ ఎక్కువగా ఉంటుంది. అదీకాకుండా స్పిన్ బౌలింగ్‌ని ఆడడంలో లబుషేన్‌కి మంచి రికార్డు ఉంది...

56
Marnus Labuschagne

రవిచంద్రన్ అశ్విన్‌ని ఫేస్ చేయడంలో స్మిత్ ఇబ్బంది పడతాడు. అయితే లబుషేన్‌కి ఈ బౌలింగ్ అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను లబుషేన్‌పై ప్రయోగిస్తే మంచి ఫలితం రాబట్టవచ్చు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...

66

ప్రస్తుతం ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో లబుషేన్ టాప్‌లో ఉండగా స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజమ్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత జట్టు తరుపున ఏడో స్థానంలో ఉన్న రిషబ్ పంత్ కారు ప్రమాదంలో చిక్కుకోవడంతో టీమ్‌కి దూరమయ్యాడు..

click me!

Recommended Stories