మనీశ్ పాండేకి ఆ సత్తా లేదు, అందుకే టీమిండియాకి దూరమయ్యాడు... ఆశీష్ నెహ్రా షాకింగ్ కామెంట్...

First Published Apr 17, 2021, 6:21 PM IST

ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే. 14 సీజన్లుగా అదరగొడుతున్న మనీశ్ పాండే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక ప్లేయర్‌గా మారాడు. మనీశ్ పాండేకి మ్యాచులు గెలిపించే సత్తా లేదని షాకింగ్ కామెంట్లు చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...

‘మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్, పరిస్థితికి తగ్గట్టుగా స్ట్రైయిక్ రేటును దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ చేయాలి... టెస్టుల్లో ఆడినట్టు సింగిల్స్ తీస్తూ ఉంటే, సక్సెస్ రాదు...
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మనీశ్ పాండే బ్యాటింగ్, ఏ మాత్రం స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌లా లేదు... ఓ టెయిలెండర్ బ్యాట్స్‌మెన్‌లా షాట్ సెలక్షన్ ఆడుతున్నాడు...
undefined
స్వింగ్ అవుతున్న బాల్స్‌ను ఆడడం లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి చాలా కష్టం. వారికి పెద్దగా ఆప్షన్లు కూడా ఉండవు. బంతి ఎలా వచ్చినా మిడ్ వికెట్, లాంగ్ ఆన్ మీదుగా షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అవుతూ ఉంటారు...
undefined
టాపార్డర్‌లో వచ్చే బ్యాట్స్‌మెన్ అయితే మిడాఫ్, కవర్స్ మీదుగా షాట్స్ ఆడతారు... మనీశ్ పాండే నుంచి ఇలాంటి బ్యాటింగ్ ఆశించాను. కానీ అతను ఓ టెయిలెండర్‌లా చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు...
undefined
రిక్వైడ్ రన్‌రేటుకి తగ్గట్టుగా స్ట్రైయిక్ రేటు మెయింటైన్ చేయడం అసలు సిసలైన మ్యాచ్ విన్నర్ లక్షణం. అది లేకనే మనీశ్ పాండే భారత జట్టుకి దూరమయ్యాడు...
undefined
మనీశ్ పాండే, సీనియర్ బ్యాట్స్‌మెన్ అయినా అతని కంటే వెనకాల వచ్చిన హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌ల ఆటతీరు చాలా మెరుగ్గా ఉంది.
undefined
పరిస్థితులను అర్థం చేసుకుని దూకుడు ఎలా పెంచాలో వీరికి బాగా తెలుసు. అది తెలియకనే మనీశ్ పాండే టీమిండియాకు దూరమయ్యాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆశీష్ నెహ్రా...
undefined
టీమిండియాకి లక్కీ హ్యాండ్‌గా మారిన మనీశ్ పాండే, భారత జట్టు తరుపున 18 మ్యాచుల్లో విజయాలను అందించాడు. మనీశ్ పాండే పర్ఫామెన్స్‌తో సంబంధం లేకుండా అతను ఉన్న ప్రతీసారి టీమిండియా విజయం సాధించింది...
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మాత్రం మనీశ్ పాండే ఏ మాత్రం కలిసి రావడం లేదు. మనీశ్ పాండే 30 బంతులకు పగా ఆడిన 80 శాతం మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడింది...
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 20 డాట్ బాల్స్ ఆడిన మనీశ్ పాండే, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు.
undefined
click me!