ఛతేశ్వర్ పూజారాది ఇక ఒడిసిన కథే! టీమిండియా ఇకనైనా ఆ కుర్రాళ్ల వైపు చూడక తప్పదా...

Published : Jun 10, 2023, 10:23 PM IST

అజింకా రహానేతో పాటు టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయాడు ఛతేశ్వర్ పూజారా. అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్ 2021 టోర్నీలో సెంచరీల మోత మోగించి టీమ్‌లోకి తిరిగి వచ్చాడు... రహానే రీఎంట్రీకి 17 నెలల సమయం పడితే, పూజారాకి 6 నెలల సమయం కూడా పట్టలేదు.. 

PREV
19
ఛతేశ్వర్ పూజారాది ఇక ఒడిసిన కథే! టీమిండియా ఇకనైనా ఆ కుర్రాళ్ల వైపు చూడక తప్పదా...
Cheteshwar Pujara

రీఎంట్రీ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్ పూర్తి భిన్నంగా కనిపించింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 203 బంతుల్లో 90 పరుగులు చేసిన పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతుల్లో 102 పరుగులు చేశాడు...

29
Image credit: PTI

అయితే ఆ తర్వాత పూజారా మళ్లీ పాత బాటే పట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో 4 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 140 పరుగులే చేశాడు ఛతేశ్వర్ పూజారా. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది..
 

39


2020 ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఛతేశ్వర్ పూజారా, 28 టెస్టుల్లో 29.69 సగటుతో 1455 పరుగులే చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
 

49
Cheteshwar Pujara

ముఖ్యంగా టీమ్‌కి ఎప్పుడు అవసరమో, ఆ సమయాల్లో ఛతేశ్వర్ పూజారా బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రావడం లేదు. గత 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 8, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పూజారా...

59
Image credit: PTI

తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసి అవుటైన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

69

ఛతేశ్వర్ పూజారా కోసం సర్ఫరాజ్ ఖాన్, రంజీ ట్రోఫీల్లో రికార్డు లెవెల్లో పరుగులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు టీమిండియా సెలక్టర్లు. అలాగే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లు, దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నారు...

79

ఐపీఎల్‌లో ఫెయిల్ అయిన పృథ్వీ షా,ఆడిలైడ్ టెస్టు తర్వాత తిరిగి టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.  అదీకాకుండా పూజారా వయసు 35 ఏళ్లు. వచ్చే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకూ ఆడతాడో లేదో తెలీదు..

89
pujara

ఆడినా అప్పటికి పూజారా వయసు 37 ఏళ్లకు చేరుకుంటుంది. గత రెండు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో పూజారా ఆటతీరు చూసిన తర్వాత కూడా అతన్ని టీమ్‌లో కొనసాగించడం మూర్ఖత్వమే అవుతుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..
 

99
Rishabh Pant-Pujara

ఇంకా ఛతేశ్వర్ పూజారా కోసం చూడకుండా సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్లను టెస్టు టీమ్ కోసం తయారుచేయాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. మరి బీసీసీఐ సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో.. 

click me!

Recommended Stories