ధోనీ కొత్త వ్యాపారం... టమాటాలు, పాలు,కూరగాయలు అమ్ముతున్న భారత మాజీ కెప్టెన్...

Published : Dec 05, 2020, 02:40 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేసినా సంచలనమే. భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ... 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరం ఉన్నాడు. 2020 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేసిన ధోనీ... కొత్త వ్యాపారం మొదలెట్టాడు.

PREV
110
ధోనీ కొత్త వ్యాపారం... టమాటాలు, పాలు,కూరగాయలు అమ్ముతున్న భారత మాజీ కెప్టెన్...

మహేంద్ర సింగ్ ధోనీ వ్యవసాయం అంటే చాలా ప్రీతి. క్రికెట్‌కి దూరంగా ఉన్నన్ని రోజులు ట్రాక్టర్‌పై పొలం దున్నుతూ కనిపించాడు ధోనీ...

210

రాంఛీలో దుర్వాలో మహేంద్ర సింగ్ ధోనీకి 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ధోనీ, కోళ్ల పరిశ్రమను కూడా ప్రారంభించాడు.

310

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 వేల కడక్‌నాథ్ కోళ్లను కొనుగోలు చేసిన ధోనీ... తన ఫామ్ హౌజ్‌లో వీటితో పాటు పాల పరిశ్రమను కూడా ఏర్పాటుచేశాడు...

410

గత దశాబ్దంలో మోస్ట్ పాపులారిటీ తెచ్చుకున్న క్రికెటర్‌గా వందల కోట్లు ఆర్జించిన ధోనీ... క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను అమ్ముతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

510

తన పొలంలో పండిన టమోటా, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలీ వంటి కూరగాయాలను రాంఛీలో అమ్ముతున్నాడట ధోనీ. ప్రతీరోజూ ధోనీ ఫామ్ హౌజ్ నుంచి దాదాపు 80 కిలోల టమోటాలు మార్కెట్‌కి వస్తున్నాయట.

610

ప్రస్తుతం కిలో టమోటాలను 40 రూపాయలకు అమ్ముతున్న ధోనీ... త్వరలోనే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీని కూడా మార్కెట్‌కి తరలించడానికి సిద్ధం చేస్తున్నాడట.

710

కూరగాయలతో పాటు ధోనీ ఫామ్‌హౌజ్‌లో ఆవులను, గేదెలను కూడా పెంచుతున్నాడు... 70 మేలుజాతి ఆవులను పంజాబ్ నుంచి తెప్పించిన ధోనీ... వాటి ద్వారా దాదాపు 300 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నాడట.

810

వీటిని మార్కెట్‌లో లీటర్‌కి 55 రూపాయలకు అమ్ముతున్నారట. పాల అమ్మకాల కోసం ప్రత్యేకంగా ధోనీ, కొన్ని ఏరియాల్లో పాల బూత్‌లను కూడా ఏర్పాటు చేశాడు.

910

కొన్నిరోజుల క్రితం తీసుకొచ్చిన కడక్‌నాథ్ కోళ్ల పర్యవేక్షణ చూసుకునేందుకు ప్రత్యేకంగా వైద్యులను నియమించిన ధోనీ... రోజూ తన ఫామ్‌హౌజ్‌కి వెళుతూ కొంత సమయం అక్కడ గడుపుతున్నాడు.

1010

కూరగాయాల అమ్మకం, పాల అమ్మకం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయి నేరుగా ధోనీ బ్యాంకు ఖాతాకి వెళ్లేలా ఏర్పాట్లు చేశాడట. ఫామ్ హౌజ్ వ్యాపారం ద్వారా ప్రస్తుతానికి నెలకి రూ.6 లక్షల ఆదాయం అందుకుంటున్న ధోనీ.. రాబోయే రోజుల్లో రూ.20 లక్షల దాకా ఆదాయం ఆర్జించబోతున్నాడు.

click me!

Recommended Stories