విరాట్ ఇదేం స్ట్రాటెజీ, అదంతా డ్రామాలా అనిపిస్తోంది... మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కామెంట్స్...

First Published Aug 27, 2021, 8:14 PM IST

అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాపై, కెప్టెన్ విరాట్ కోహ్లీపై నోరుపారేసుకుంటూ ఉంటాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్. హెడ్డింగ్‌లే టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ స్ట్రాటెజీలపై విమర్శలు గుప్పించాడు మైకెల్ వాగన్...

లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా తొలి ఓవర్ వేసి, రోరీ బర్న్స్ వికెట్ తీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మహ్మద్ షమీని తీసుకొచ్చి, ఇంకో వికెట్ సాధించగలిగాడు విరాట్ కోహ్లీ...

వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో మిగిలిన బ్యాట్స్‌మెన్‌పై ఆ ఎఫెక్ట్ పడింది. వరుస వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, 50 ఓవర్లు కూడా ఆడకుండానే 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

అయితే మూడో టెస్టులో మాత్రం వీరిద్దరినీ కాదని, ఇషాంత్ శర్మతో ఓపెనింగ్ ఓవర్ వేయించాడు విరాట్ కోహ్లీ. అయితే మొదటి ఓవర్‌లో వికెట్ తీయలేకపోయిన ఇషాంత్ శర్మ, ఏకంగా 7 పరుగులు సమర్పించాడు...

మొదటి రోజు పెద్దగా ప్రభావం చూపించలేకపోయినప్పటికీ, రెండో రోజు కూడా ఇషాంత్ శర్మతోనే ఓపెనింగ్ స్పెల్ వేయించాడు విరాట్ కోహ్లీ. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు మైకెల్ వాగన్...

‘తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయినా తర్వాత బౌలింగ్‌లో కట్టుదిట్టంగా ఉంటూ, ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టాలి. కానీ విరాట్ కోహ్లీ అలా చేయలేదు... మొదటి రోజు ఇషాంత్ శర్మ, మిగిలిన వారికంటే ఘోరంగా విఫలమయ్యాడు...

ప్రత్యర్థికి మంచి ఆరంభం దక్కినప్పుడు మళ్లీ అతనితోనే మూడో రోజు ఓపెనింగ్ బౌలింగ్ వేయించడం ఏ స్ట్రాటెజీ కిందకి వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. రెండో రోజు మొదటి గంటలో వీలైనన్ని వికెట్లు తీస్తే, ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెరిగేది...

అంటే టీమ్‌లో ఉన్న బెస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాతో ఓపెనింగ్ చేయించాలి. లేదా మహ్మద్ షమీకైనా బౌలింగ్ ఇవ్వాలి. కానీ విరాట్ కోహ్లీ మాత్రం వింతగా ఆలోచించాడు...

ఉత్తమమైన జట్టు అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాణించగలగాలి. భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. ప్రస్తుత ఉన్న బెస్ట్ టీమ్స్‌లో టీమిండియా కూడా ఒకటి. 

అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాణించగలమని నిరూపించుకోకపోతే, టీమిండియా గొప్ప టీమ్ కాదు, కాబోదు... ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆట చూస్తుంటే కేవలం వాళ్లని వాళ్లు నిరూపించుకోవాలని ఆడుతున్నట్టుగా ఉంది...

లార్డ్స్‌లో జట్టు మొత్తం కలిసి భలేగా ఆడింది. బుమ్రా, షమీ భాగస్వామ్యం పెరుగుతున్నప్పుడు లార్డ్స్ రూమ్ నుంచి జట్టు సభ్యులందరూ కలిసి వారిని ఎంకరేజ్ చేశారు... అది నాకెంతో నచ్చింది...

అయితే అది జరిగిన వారం తర్వాత జరుగుతున్న మూడో మ్యాచ్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు చూస్తుంటే, లార్డ్స్ టెస్టు పర్ఫామెన్స్ అంతా ఏదో డ్రామాలా, షో చేయడం కోసం చేసినట్టుగా ఉంది... 

క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఆడినప్పుడే, జట్టులో నిజమైన ఐకమత్యం ఉన్నట్టు... మూడో టెస్టు మొదటి రెండు రోజుల్లో మాత్రం నాకది కనిపించలేదు. ఈ రెండు రోజులు వాళ్లు చెత్త క్రికెట్ ఆడారు...’ అంటూ కామెంట్ చేశాడు మైకెల్ వాగన్...

click me!