Hardik Pandya: రెడ్ బాల్ క్రికెట్ లో హార్ధిక్ ఇప్పటివరకూ.. 11 టెస్టులు ఆడి 18 ఇన్నింగ్స్ లలో 532 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2018 తర్వాత అతడు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడలేదు.
2021లో ఫామ్ కోల్పోయి, గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్, ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్ లో సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా తిరిగి పునరాగమనంలో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా గతేడాది హార్ధిక్ కెరీర్ లో మరిచిపోలేనిది.
27
Image Credit: PTI
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అతడిని పక్కనబెట్టినా గుజరాత్ టైటాన్స్ కు సారథిగా వ్యవహరించి ఏకంగా తొలి ప్రయత్నంలోనే కప్ కొట్టాడు. ఆ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి అటు బంతితోనూ ఇటు బ్యాట్ తోనూ రఫ్ఫాడిస్తున్నాడు.
37
టీ20లలో రోహిత్ వారసుడిగా హార్ధిక్ పాండ్యాను నియమించే అవకాశాలే మెండుగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకు కొనసాగింపా అన్నట్టు వన్డే జట్టులో రోహిత్ కు డిప్యూటీగా అతడి పేరును ప్రకటించింది బీసీసీఐ. ఈ ఏడాది స్వదేశంలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో హార్ధిక్ పాండ్యా కీలకంగా వ్యవహరించనున్నాడు.
47
ఇక రెండు ఫార్మాట్లలో అలరిస్తున్న పాండ్యా.. తిరిగి టెస్టు జట్టులోకి వచ్చేదెపుడు..? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అతడికి ఇదే ప్రశ్న ఎదురైంది.
57
దానికి హార్ధిక్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. హార్ధిక్ స్పందిస్తూ.. ‘నేను మళ్లీ టెస్టు జట్టులోకి ఎప్పుడొస్తాను..? ముందైతే నన్ను ఈ బ్లూ జెర్సీని (పరిమిత ఓవర్ల ఫార్మాట్) పూర్తిగా ఆస్వాదించనివ్వండి. ఆ తర్వాత వైట్ జెర్సీ (టెస్టులు) గురించి ఆలోచిస్తా..’ అని అన్నాడు. రెడ్ బాల్ క్రికెట్ లో హార్ధిక్ ఇప్పటివరకూ.. 11 టెస్టులు ఆడి 18 ఇన్నింగ్స్ లలో 532 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2018 తర్వాత అతడు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడలేదు.
67
శ్రీలంకతో మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా పాండ్యా ఈ ఏడాది తాను భారత్ కు ప్రపంచకప్ అందించాలని న్యూఈయర్ రెజెల్యూషన్ పెట్టుకున్నానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
77
టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టుకు పొట్టి ఫార్మాట్ లో సారథిగా వ్యవహరించిన హార్ధిక్.. జట్టును ముందుండి నడిపించాడు. భారత్ ఈ సిరీస్ కూడా నెగ్గింది. ఇక తాజాగా శ్రీలంకతో కూడా తొలి మ్యాచ్ లో భారత్ జయకేతనం ఎగురవేసిన విషయం విదితమే.