మరో ఆర్‌సీబీలా మారిన కోల్‌కత్తా... కేకేఆర్ నుంచి బయటికి వస్తే చాలు! టీమిండియాకి ఆడే ఛాన్స్...

First Published Jan 4, 2023, 2:14 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌లక్కీ టీమ్ అంటే ఆర్‌సీబీ పేరే గుర్తుకు వస్తుంది అందరికీ. స్టార్ ప్లేయర్లు, ఐపీఎల్ టైటిల్ గెలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా అదృష్టానికి ఆమడ దూరంలో ఉంటుంది ఆర్‌సీబీ. అయితే ఇప్పుడు కేకేఆర్ కూడా ఆర్‌సీబీలా తయారైంది..

ఆర్‌సీబీ నుంచి బయటికి వచ్చిన ప్లేయర్లు, వేరే ఫ్రాంఛైజీ తరుపున అదరగొడతారనేది ఫ్యాన్స్ సెంటిమెంట్. ఇంతకుముందు కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్, క్రిస్ గేల్, సిమ్రాన్ హెట్మయర్, మార్కస్ స్టోయినిస్.. ఇలా స్టార్ ప్లేయర్లంతా ఆర్‌సీబీలో ఫ్లాప్ అయ్యి, బయటికి వెళ్లినవాళ్లే...

Image credit: PTI

ఇప్పుడు కేకేఆర్ కూడా ఇలాగే తయారైంది. కేకేఆర్ నుంచి బయటికి వచ్చిన ప్లేయర్లు అందరూ ఒక్కొక్కరిగా టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేస్తుండడం విశేషం. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 ద్వారా శుబ్‌మన్ గిల్, శివమ్ మావి అంతర్జాతీయ టీ20 ఆరంగ్రేటం చేశారు...

Image credit: PTI

శుబ్‌మన్ గిల్ గత ఏడాది కేకేఆర్ నుంచి బయటికి రాగా, శివమ్ మావిని ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అలాగే కేకేఆర్ నుంచి బయటికి వచ్చిన రాహుల్ త్రిపాఠి, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు. 
 

ఐపీఎల్‌లో ధారాళంగా పరుగులు ఇస్తున్నా, శివమ్ మావి దేశవాళీ టోర్నీల్లో చూపించిన పర్ఫామెన్స్‌ని ఆధారంగా తీసుకుని, అంతర్జాతీయ అవకాశం కల్పించింది టీమిండియా. తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు శివమ్ మావి..

ఇప్పటికే ఆరు నెలలుగా టీమ్‌కి సెలక్ట్ అవుతున్నా, రిజర్వు బెంచ్‌కే పరిమితం అవుతూ వస్తున్న రాహుల్ త్రిపాఠి త్వరలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడు... అలాగే కేకేఆర్ నుంచి బయటికి వచ్చిన దినేశ్ కార్తీక్ మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో రీఎంట్రీ ఇచ్చాడు.

2018 నుంచి కేకేఆర్‌లో ఉంటున్న దినేశ్ కార్తీక్, 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకి దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి భారత జట్టు తరుపున ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలు ఆడాడు...

Image credit: PTI

వీరితో పాటు ఇప్పుడు టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్ కూడా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లోనే కెరీర్ ప్రారంభించాడు. కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్‌కి మారిన తర్వాత సూర్య వెలుగులోకి వచ్చాడు...

కేకేఆర్‌లో సభ్యులుగా ఉన్న నితీశ్ రాణా, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్ లాంటి ప్లేయర్లు, టీమిండియాలోకి అలా వచ్చి ఇలా మాయమయ్యారు. కేకేఆర్‌ని వదిలిన ప్లేయర్లు మాత్రం భారత జట్టులో సెటిల్ అయిపోతున్నారు. దీంతో కేకేఆర్ మరో ఆర్‌సీబీలా మారిందని అంటున్నారు నెటిజన్లు.. 

click me!