లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022: బరిలో సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్... జనవరి 20 నుంచే...

Published : Jan 04, 2022, 01:58 PM IST

విరాట్ కోహ్లీ మెరుపులు లేవు, రోహిత్ శర్మ బాదుడు లేదు... ఎంతైనా వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి బ్యాట్స్‌మెన్ ఆడినప్పుడు వచ్చినంత మజా మాత్రం ఇప్పుడు లేదని ఫీల్ అయ్యేవారికి ఇది కచ్ఛితంగా గుడ్ న్యూసే... క్రికెట్‌కి రిటైర్మెంట్ తీసుకున్న ఆ లెజెండ్స్ తిరిగి మరోసారి క్రీజులో దిగబోతున్నారు...

PREV
19
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022: బరిలో సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్... జనవరి 20 నుంచే...

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న లెజెండరీ క్రికెటర్లందరూ కలిసి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది జనవరి 20 నుంచి ఘనంగా ప్రారంభకానుందీ లెజెండరీ లీగ్ క్రికెట్‘ఎల్‌ఎల్‌సీ’...

29

జనవరి 20 నుంచి 29 వరకూ ఓమన్‌లోని మస్క‌ట్‌లో గల అల్ అమెరత్ క్రికెట్ స్టేడియంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచులన్నీ జరగనున్నాయి...

39

భారత జట్టు మాజీ క్రికెటర్లు ఇండియా మహరాజాస్ జట్టులో బరిలో దిగుతుంటే మిగిలిన ఆసియా జట్ల ప్లేయర్ల ఆసియా లయన్స్ టీమ్ తరుపున, ఇంగ్లాండ్, ఆసీస్, న్యూజిలాండ్, విండీస్ వంటి ఆసియేతర దేశాల మాజీ క్రికెటర్లు వరల్డ్ జెయింట్స్ జట్టు తరుపన బరిలో దిగబోతున్నారు...

49

ఇండియా మహరాజాస్ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, బద్రీనాథ్, ఆర్‌పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, నమన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ, హెమాంగ్ బదానీ, వేణుగోపాల్ రావ్, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ బండారి వంటి ప్లేయర్లు బరిలో దిగబోతున్నారు...

59

బాలీవుడ్ ‘బిగ్‌ బీ’ అమితాబ్ బచ్చన్, ఈ లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ 2022) సీజన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నాడు. మ్యాచులన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి...

69

ఆసియా లయన్స్ జట్టులో షోయబ్ అక్తర్, షాహీదీ ఆఫ్రిదీ, సనత్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్, కమ్రాన్ అక్మల్, చమిందా వాస్, రోమేష్ కలువతర, తిలకరత్నే దిల్షాన్, అజర్ మహ్మద్, ఉపుల్ తరంగ, మిస్బా వుల్ మక్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మహ్మద్ యూసఫ్, అస్గర్ ఆఫ్ఘాన్, ఉమర్ గుల్ వంటి ప్లేయర్లు ఆడబోతున్నారు...

79

వరల్డ్ జెయింట్స్ టీమ్ తరుపున బరిలో దిగనున్న ప్లేయర్ల గురించి ఇంకా క్లారిటీ రాలేదు. జాంటీ రోడ్స్,షేన్ వార్న్, షాన్ పోలాక్, బ్రియాన్ లారాతో పాటు పలువురు క్రికెటర్లు ఈ టీమ్ తరుపున ఆడే అవకాశం ఉంది...

89

‘వెటరన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇది బ్లాస్టింగ్ న్యూస్. క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన నిజమైన రాజులు, మహారాజులు, లయన్స్ మళ్లీ వస్తున్నారు. సెహ్వాగ్, యువరాజ్, భజ్జీలతో ఆఫ్రిదీ, మురళీ, షోయబ్‌లతో మ్యాచ్ ఆడితే మళ్లీ చూడాలనుకుంటున్నారా... అయితే సిద్ధంగా ఉండండి...’ అంటూ ఎల్‌ఎల్‌సీ కమిషనర్ రవిశాస్త్రి కామెంట్ చేశారు...

99

జనవరి 20న ఇండియా మహారాజాస్ జట్టు, ఆసియా లయన్స్‌తో తలబడుతుంది. ఆ తర్వాత 22న వరల్డ్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడే మహరాజాస్, 24న మరోసారి ఆసియా లయన్స్‌తో, 26న వరల్డ్ జెయింట్స్‌తో మ్యాచులు ఆడతారు. టేబుల్ టాపర్‌గా నిలిచిన రెండు జట్ల మధ్య జనవరి 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

click me!

Recommended Stories