బెన్ స్టోక్స్‌కి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీ... యాషెస్ సిరీస్‌లో మరో టెస్టు ఓడితే జో రూట్‌‌పై వేటు...

Published : Jan 04, 2022, 01:14 PM IST

క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్‌కి ఓ సెపరేట్ క్రేజ్ ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ టెస్టు మ్యాచులను ఆసక్తిగా వీక్షిస్తారు...

PREV
112
బెన్ స్టోక్స్‌కి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీ... యాషెస్ సిరీస్‌లో మరో టెస్టు ఓడితే జో రూట్‌‌పై వేటు...

ఈసారి యాషెస్ సిరీస్ మాత్రం అభిమానులకు ఆశించిన మజాని అందించలేకపోయింది. మొదటి మూడు టెస్టుల్లోనూ పూర్తి ఆధిపత్యం చూపించి, సునాయాస విజయాలు అందుకుంది ఆస్ట్రేలియా...

212

గబ్బా టెస్టు ఓడిన తర్వాత మిగిలిన రెండు టెస్టుల్లో మరింత దారుణంగా ఓడింది ఇంగ్లాండ్ జట్టు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని చవిచూసింది...

312

ఆస్ట్రేలియాలో ఆసీస్ జట్టును ఓడించడం కష్టమే. అయితే ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్ కనీస పోరాటం కూడా చూపించకపోవడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది...

412

యాషెస్ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లో ఓడి, సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్, మిగిలిన రెండు టెస్టుల్లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది...

512

అయితే నాలుగో టెస్టు ఆరంభానికి ముందు ఓల్లీ రాబిన్‌సన్ గాయం కారణంగా తప్పుకోవడం ఇంగ్లాండ్ జట్టును మరింత ఇబ్బందిపెట్టే విషయం...

612

మూడు మ్యాచుల్లో 9 వికెట్లు తీసిన ఓల్లీ రాబిన్‌సన్, ఇంగ్లాండ్ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. జేమ్స్ అండర్సన్ 2 టెస్టుల్లో 7 వికెట్లు తీశాడు...

712

వరుసగా మూడు టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌ జో రూట్‌పై, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు వేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం...

812

టెస్టు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని చర్చలు నడుస్తున్నాయి. అయితే బెన్ స్టోక్స్‌ మాత్రం కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా లేడట...

912

మెంటల్ హెల్త్ కోసం క్రికెట్ నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న బెన్ స్టోక్స్, యాషెస్ సిరీస్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పటిదాకా అతని నుంచి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ మాత్రం రాలేదు...

1012

‘కెప్టెన్సీ అంటే జట్టు ఫీల్డింగ్ సెట్ చేయడం, ప్లేయర్లను సెలక్ట్ చేయడం, మ్యాచ్ మధ్యలో నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించాల్సి ఉంటుంది...

1112

జట్టు విఫలమైతే ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. జట్టును మళ్లీ విజయతీరాలకు చేర్చేందుకు అవసరమైన అడుగులు వేయాల్సి ఉంటుంది. జో రూట్‌లో ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి...

1212

జనాలు ఏమనుకుంటున్నారే దానికంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లు కెప్టెన్సీ గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. జో రూట్‌కీ, క్రిస్ సిల్వర్‌వుడ్‌కి మా టీమ్ పూర్తి సపోర్ట్ ఉంది... ’అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్..

click me!

Recommended Stories