బుమ్రాకి ఏం చేయాలో తెలుసు, వాడికి అలా వదిలెయ్... విరాట్ కోహ్లీతో ఇషాంత్ శర్మ...

First Published Feb 6, 2023, 1:16 PM IST

టీమిండియా తరుపున 100 టెస్టులు ఆడిన ఆఖరి ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. లంబో తర్వాత విరాట్ కోహ్లీ మాత్రమే 100కి పైగా టెస్టులు ఆడిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఇషాంత్ శర్మ, టీమ్‌కి దూరమైపోయాడు...
 

టీమిండియా తరుపున 105 టెస్టులు ఆడి 311 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, కెరీర్ చివర్లో గాయాలతో తీవ్రంగా సతమతమయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడి, ఆస్ట్రేలియా పర్యటనకు కూడా వెళ్లలేకపోయాడు ఇషాంత్ శర్మ...

bumrah Kohli

టీమిండియాలో సీనియర్ మోస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న ఇషాంత్ శర్మ, భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2018 ఆస్ట్రేలియా టూర్‌లో 3 మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు...

‘‘2018లో సౌతాఫ్రికా పర్యటన తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లాం. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్. మొదటి స్పెల్‌లో జస్ప్రిత్ బుమ్రా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారీగా పరుగులు ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో రిథమ్ లేకపోవడాన్ని విరాట్ కోహ్లీ గమనించాడు...

కోహ్లీ నా దగ్గరికి వచ్చి, ‘నేను వెళ్లి అతనితో మాట్లాడాలని అనుకుంటా...’ అన్నాడు. నేను, కోహ్లీతో ఒక్కటే చెప్పా... ‘అతను చాలా స్మార్ట్ బౌలర్. అతనికి ఏం చేయాలో బాగా తెలుసు. బుమ్రాని అలా వదిలెయ్. కొన్నిసార్లు గేమ్‌ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. 

నువ్వేం చెప్పకు, అతనేం చేస్తాడో చూడు... టెస్టు క్రికెట్‌లో ఆట అర్థమైతే కమ్‌బ్యాక్ ఇవ్వడానికి పెద్ద సమయం పట్టదు...’ అని చెప్పాను. దానికి కోహ్లీ సరే అన్నాడు... నేను అనుకున్నట్టే బుమ్రా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అతనిలో లీడర్ ఉన్నాడని అప్పుడే అర్థమైంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ...

kohli bumrah

2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 మ్యాచుల్లో 21 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు జస్ప్రిత్ బుమ్రా. మహ్మద్ షమీ 16, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీసి టీమిండియాకి 2-1 తేడాతో టెస్టు సిరీస్ విజయాన్ని అందించారు...

Ishant Sharma and Virat Kohli

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత ఇషాంత్ శర్మ, టీమ్‌లో చోటు కోల్పోయాడు. గాయం కారణంగా జస్ప్రిత్ బుమ్రా, ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, సీనియర్ ప్లేయర్‌గా మాత్రమే టీమ్‌లో కొనసాగుతున్నాడు.

click me!