మనకంటే వాళ్లకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై అశ్విన్ షాకింగ్ కామెంట్...

First Published Feb 6, 2023, 12:38 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టెస్టు సిరీస్ కోసం ఇరు జట్లు తమ అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. 2004 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓడిపోని దుర్భేధ్యమైన రికార్డు టీమిండియా సొంతం. అదీకాక గత మూడు సీజన్లలో టైటిల్ సాధించి, ఆసీస్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది భారత జట్టు...

2019 ఆస్ట్రేలియా పర్యటనలో 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. అయితే ఆ సమయంలో నిషేధం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ అందుబాటులో లేకపోవడం వల్లే టీమిండియా గెలిచిందనే అన్నారు ఆసీస్ ఫ్యాన్స్, కోహ్లీ కెప్టెన్సీలో టెస్టు సిరీస్ గెలుపుని ఓర్వలేని కొందరు యాంటీ ఫ్యాన్స్...

అయితే 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాభవం తర్వాత కూడా అదిరిపోయే రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చి 2-1 తేడాతో సిరీస్ గెలిచింది టీమిండియా... తొలి టెస్టు తర్వాత విరాట్ స్వదేశానికి వచ్చినా అజింకా రహానే తన కెప్టెన్సీతో అసాధారణ విజయాలను అందించాడు...
 

Ravichandran Ashwin

ఇప్పుడు ఇండియాలో టీమిండియాని ఓడించి, గత రెండు పరాభవాలకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది ఆస్ట్రేలియా. అయితే ఈసారి ఇండియా కంటే ఆస్ట్రేలియాకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, చూస్తుంటే ఆసీస్‌కి 55 శాతం విన్నింగ్ ఛాన్సులు ఉన్నాయిని ఓ అభిమాని కామెంట్ చేశాడు. దీనికి రవిచంద్రన్ అశ్విన్, ‘అవును...ఒప్పుకోవాల్సిందే’ అంటూ కామెంట్ చేశాడు...

Ashwin

అశ్విన్ ఉన్నాడు, సిరీస్ గెలిపిస్తాడని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుంటే, అతనే ఈసారి ఆస్ట్రేలియా ఫెవరెట్ అంటూ తేల్చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే అశ్విన్‌కి నమ్మకం తగ్గిపోవడానికి కారణాలు లేకపోలేదు... 

విదేశాల్లో ఘన విజయాలు అందుకుని, ఆస్ట్రేలియాకి ముచ్ఛెమటలు పట్టించిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా లేకపోవడం ఆసీస్‌కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. కోహ్లీ టెస్టుల్లో బ్యాటర్‌గానూ చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేడు... విరాట్‌ని అవుట్ చేస్తే, భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ని కకావికలం చేయడం ఆసీస్‌కి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.. గత సిరీస్ విజయాన్ని అందించిన అజింకా రహానే అయితే టీమ్‌లోనే లేడు...

టాపార్డర్ ఫెయిల్ అయినా లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి అమూల్యమైన ఇన్నింగ్స్‌లు నిర్మించేవాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. వికెట్ల వెనకాల సెడ్జింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లతో ఓ ఆటాడుకునేవాడు. అలాంటి రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి,జట్టుకి దూరం కావడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించనుంది...

Ashwin

అలాగే స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా కూడా తొలి రెండు టెస్టుల్లో ఆడడం లేదు. బుమ్రా లేకుండా మిగిలిన బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను ఎంత వరకూ ఇబ్బంది పెట్టగలరనేది అనుమానమే. దీంతో టీమిండియా కంటే ఆస్ట్రేలియా సిరీస్ గెలిచే ఛాన్స్ ఎక్కువని భావిస్తున్నారు కొందరు ఫ్యాన్స్...

click me!