ఇది ఇలాగే పోతే క్రికెట్ కూడా ఫుట్‌బాల్‌లా మారుతుంది... ఐసీసీకి కపిల్ దేవ్ హెచ్చరిక...

Published : Aug 16, 2022, 12:31 PM ISTUpdated : Aug 16, 2022, 12:49 PM IST

న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడం పెను సంచలనం క్రియేట్ చేసింది. క్వింటన్ డి కాక్ పీక్ స్టేజ్‌లో ఉండగా టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు. టీ20లు వచ్చిన తర్వాత వన్డేలకు క్రేజ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఫ్రాంఛైజీ క్రికెట్ రాకతో అంతర్జాతీయ క్రికెట్‌కి ఆదరణ రోజురోజుకీ తగ్గిపోతోంది... 

PREV
110
ఇది ఇలాగే పోతే క్రికెట్ కూడా ఫుట్‌బాల్‌లా మారుతుంది... ఐసీసీకి కపిల్ దేవ్ హెచ్చరిక...

కిరన్ పోలార్డ్, ఆండ్రూ రస్సెల్, క్రిస్ గేల్ వంటి క్రికెటర్లు... వెస్టిండీస్ జట్టుకి ఆడిన మ్యాచుల కంటే ఫ్రాంఛైజీలకు ఆడిన మ్యాచుల సంఖ్యే ఎక్కువ... స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేక బీ టీమ్‌తో మ్యాచులు ఆడాల్సిన పరిస్థితి విండీస్‌ది...

210
IPL Trophy

ఐపీఎల్ కోసం ఎఫ్‌టీపీ క్యాలెండర్‌లో ఏకంగా రెండు నెలల పాటు షెడ్యూల్‌ని కేటాయించింది ఐసీసీ. అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సాగే రెండు నెలల పాటు ఏ ద్వైపాక్షిక సిరీస్‌లు సాగవు...

310
Big Bash League-Perth Scorchers

ఐపీఎల్‌కి తోడు బిగ్‌ బాష్ లీగ్, ది హండ్రెడ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్... ఇలా చాలా లీగ్స్‌ ఇప్పటికే జరుగుతున్నాయి. త్వరలో యూఏఈ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ప్రారంభం కాబోతున్నాయి...

410

దీంతో ఏడాది పొడవునా అన్ని లీగుల్లో అందుబాటులో ఉండేలా ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఐపీఎల్‌లో సీఎస్‌కేకి ఆడే ప్లేయర్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో, యూఏఈ టీ20 లీగ్‌లోనూ ఆడేలా కాంట్రాక్ట్ చేసుకోవాలని ఆలోచనలు సాగుతున్నాయి...

510

దీనిపై భారత మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ఇలాగే కొనసాగితే క్రికెట్ కూడా ఫుట్‌బాల్‌లా లీగ్ మ్యాచులకు పరిమితమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు కపిల్ దేవ్...

610

‘అంతర్జాతీయ క్రికెట్ త్వరలోనే అంతర్ధానమయ్యే పరిస్థితి వచ్చేసింది. దీనికి ఐసీసీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ బోర్డులను మేనేజ్ చేస్తుంది అదే కదా...

710

యూరప్‌లో ఫుట్‌బాల్ టోర్నీల్లాగా ప్లేయర్లు దేశానికి ఆడడం కంటే ఫ్రాంఛైజీలకు ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లా అంతర్జాతీయ క్రికెట్ కూడా ఏ వరల్డ్ కప్‌కో పరిమితమవుతుంది...

810

మిగిలిన సమయాల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా టీ20 ఫ్రాంఛైజీ లీగులే జరుగుతాయి. త్వరలో ఈ పరిస్థితి వస్తుంది. వన్డేలు, టెస్టు మ్యాచులు ఆడేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపించరు... ఐసీసీ ఇప్పటికైనా కళ్లు చెదిరి, ఈ రెండు ఫార్మాట్లను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలి...

910
Image credit: Getty

క్లబ్ క్రికెట్ అప్పుడప్పుడూ జరిగితే మంచిదే. దీని వల్ల కుర్రాళ్లకు అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడే అవకాశం దక్కుతుంది. అయితే ఇది ఐపీఎల్, బిగ్‌బాష్‌తో ఆడకుండా సౌతాఫ్రికా లీగ్, యూఏఈ లీగ్... ఇలా పెరుగుతూ పోతున్నాయి...
 

1010

ఇప్పుడు దేశాలు కూడా క్లబ్ క్రికెట్ నిర్వహించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది కంటే దాని నుంచి వాళ్లకు చాలా డబ్బులు వస్తాయి. కాబట్టి ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌కి వరల్డ్ కప్‌లకే పరిమితం కావచ్చు... ’ అంటూ కామెంట్ చేశాడు కపిల్ దేవ్..

click me!

Recommended Stories