ICC: ఐసీసీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా గంగూలీ..? దాదా ఏం చెప్పాడంటే..

Published : Aug 16, 2022, 11:41 AM IST

ICC President Elections: నవంబర్ లో జరుగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి  బీసీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పోటీ చేయనున్నాడా..? కొద్దికాలంగా వినిపిస్తున్న ఊహాగానాలపై దాదా ఏం చెప్పాడు..? 

PREV
17
ICC: ఐసీసీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా గంగూలీ..? దాదా ఏం చెప్పాడంటే..

టీమిండియా మాజీ సారథి,  బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న  సౌరవ్ గంగూలీ.. త్వరలోనే ప్రపంచ క్రికెట్‌కు బాస్ కాబోతున్నాడా..? దాదా.. ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడా..?  గత కొంతకాలంగా భారత  క్రికెట్ లో దీనిపై జోరుగా చర్చ నడుస్తున్నది. 

27

అయితే దీనిపై అటు బీసీసీఐ గానీ, ఇటు గంగూలీ గానీ ఇంతవరకూ స్పందించలేదు. అలాగని ఈ వార్తలను ఖండించనూ లేదు. దీంతో  కోల్‌కతా ప్రిన్స్ నెక్స్ట్ టార్గెట్ ఐసీసీయే అని  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో దాదా  తాజాగా స్పందించాడు. 

37

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. ‘చూడండి. ఇవన్నీ ఊహాగానాలు. ఎవరికి నచ్చింది వాళ్లు రాసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఐసీసీ చీఫ్ అనే పదవి అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. 

47

అయినా నేను ఆ రేసులో లేను. నా చేతుల్లో ఏమీ లేదు. బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం  నిర్ణయమే ఈ విషయంలో ఫైనల్..’అని స్పష్టం చేశాడు. అయితే దాదా కామెంట్స్ పై క్రికెట్ విశ్లేషకులు స్పందిస్తూ.. ఐసీసీ అధ్యక్ష పదవిని అధిరోహించడానికి దాదా రూట్ క్లీయర్ చేసుకుంటున్నాడని, అందుకే తన బాధ్యతను ప్రభుత్వం మీదకు నెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. 

57

ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది భారత్ లో ప్రపంచకప్ నిర్వహిస్తుండటంతో ఐసీసీ చైర్మెన్ గా భారతీయుడు ఉంటే బెటరనే అభిప్రాయం వినపడుతోంది. క్రికెట్ వర్గాలలో కూడా ఇదే చర్చ నడుస్తున్నది. 2011 లో శరద్ పవార్.. ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ ఏడాది భారత్ వన్డే ప్రపంచకప్ నెగ్గింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చర్చ నడుస్తున్నది. 
 

67

బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా పదవీకాలం ఈ సెప్టెంబర్ ఆఖరుకు ముగియనుంది. తన పదవీకాలాన్ని పొడగించుకునేందుకు గాను దాదా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మేరకు బీసీసీఐ రాజ్యాంగంలో తాము చేసిన సవరణలపై కోర్టును ఆశ్రయించాడు.ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.  

77

మరోవైపు నవంబర్ తో ఐసీసీ చీఫ్ గ్రెగ్ బార్క్లీ పదవీకాలం ముగియనుంది. ఆలోపు బీసీసీఐ అధ్యక్ష్ పదవి ఎలాగూ ముగియనుంది కావున.. దానికి రాజీనామా చేసేసి ఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని దాదా భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ సెక్రెటరీ గా కూడా పనిచేస్తున్నారు. 

click me!

Recommended Stories