అతను టీమిండియాకి ఏబీడీ! సరిగ్గా వాడుకోవడం తెలియాలి... రికీ పాంటింగ్ కామెంట్...

Published : Aug 16, 2022, 11:54 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత కెఎల్ రాహుల్ గాయపడడంతో ఓపెనర్ల విషయంలోనూ రకరకాల ప్రయోగాలు చేస్తోంది టీమిండియా. దీపక్ హుడా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లను ఓపెనర్లు వాడిన భారత జట్టు, ఓ విధంగా ఈ మూడు ప్రయోగాల్లోనూ సక్సెస్ అయ్యింది...

PREV
18
అతను టీమిండియాకి ఏబీడీ! సరిగ్గా వాడుకోవడం తెలియాలి... రికీ పాంటింగ్ కామెంట్...
Image credit: Getty

వెస్టిండీస్‌తో జరిగిన టీ2 సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరీ అదరగొట్టకపోయినా పర్వాలేదనిపించాడు. కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇస్తుండడంతో ఆసియా కప్ 2022 టోర్నీలో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది...

28
Suryakumar Yadav

‘సూర్యకుమార్ యాదవ్, టీమిండియాకి ఏబీ డివిల్లియర్స్ లాంటోడు. అతను 360 డిగ్రీల్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. సూర్య ఏ పొజిషన్‌లో అయినా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్...

38

ఓపెనర్‌గా కంటే మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో బాగా ఆడగలడు. ఎందుకంటే కొత్త బంతిని ఫేస్ చేసేటప్పుడు కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అదే మిడిల్ ఓవర్లలో అయితే ఫ్రీగా బ్యాటింగ్ చేయొచ్చు...

48
Suryakumar Yadav

పవర్ ప్లేలో ఓపెనర్లు పరుగులు చేస్తే, పవర్ ప్లే ముగిసిన తర్వాత బౌండరీలు బాదగల సత్తా సూర్యకుమార్ యాదవ్ సొంతం. నన్ను అడిగితే అతనికి టాప్ 4 ప్లేస్ కరెక్ట్‌గా సెట్ అవుతుంది...

58

టీ20 వరల్డ్ కప్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి టీమ్‌లో కచ్ఛితంగా ప్లేస్ ఉంటుంది. అతను టీమ్ ప్లేయర్. ఆస్ట్రేలియాలోని క్రికెట్ ఫ్యాన్స్ ఓ చాలా మంచి ఆటను చూడబోతున్నారు...

68
Suryakumar Yadav

లెగ్ సైడ్ సూర్యకుమార్ యాదవ్ ఆడే షాట్స్ చాలా బాగుంటాయి. ఫాస్ట్ బౌలింగ్‌లోనే కాదు, స్పిన్ బౌలింగ్‌లోనూ భారీ షాట్లు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్...’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

78

ఐపీఎల్ 2020 తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ 23 టీ20 మ్యాచుల్లో 37.33 సగటుతో 672 పరుగులు చేశాడు. స్ట్రైయిక్ రేటు 175.45గా ఉంది...

88

వెస్టిండీస్‌తో సిరీస్‌లో మూడో టీ20లో హాఫ్ సెంచరీతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 2 ప్లేస్‌కి దూసుకెళ్లిన సూర్యకుమార్ యాదవ్, ఐదో టీ20లో ఆడకపోవడం వల్ల టాప్ ప్లేస్‌కి వెళ్లే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు... 

click me!

Recommended Stories