ఆ ఇద్దరు సీనియర్లకు ఇదే ఆఖరి అవకాశం... వారికి బ్యాకప్‌గానే శ్రేయాస్ అయ్యర్, గిల్ ఎంపిక...

Published : Nov 13, 2021, 05:47 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైన టీమిండియా, న్యూజిలాండ్ టీ20, టెస్టు సిరీస్ ఆడడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కి కూడా జట్టును ప్రకటించింది బీసీసీఐ... టెస్టు సిరీస్‌ ద్వారా శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ ఆరంగ్రేటం చేయబోతున్నారు...

PREV
113
ఆ ఇద్దరు సీనియర్లకు ఇదే ఆఖరి అవకాశం... వారికి బ్యాకప్‌గానే శ్రేయాస్ అయ్యర్, గిల్ ఎంపిక...

రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లకు రెస్టు ఇచ్చిన సెలక్టర్లు, శ్రేయాస్ అయ్యర్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, శ్రీకర్ భరత్ వంటి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు...

213

స్పిన్ ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్, నాలుగేళ్ల తర్వాత భారట జట్టులోకి రీఎంట్రీ ఇస్తుంటే, విరాట్ కోహ్లీ టీ20 సిరీస్‌తో పాటు మొదటి టెస్టుకి విశ్రాంతి తీసుకుని, రెండో టెస్టు సమయానికి జట్టుతో కలవబోతున్నాడు...

313

అయితే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌, టీమిండియా టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలకి ఆఖరి అవకాశం కావచ్చని టాక్ వినబడుతోంది...

413

మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన అజింకా రహానే, ఆ తర్వాత 11 టెస్టుల్లో కేవలం 19.57 సగటుతో పరుగులు చేశాడు. అతనితో పాటు ఛతేశ్వర్ పూజారా పర్ఫామెన్స్ కూడా చెప్పుకోదగినంత స్థాయిలో లేదు...

513

‘అజింకా రహానేని మొదటి టెస్టుకి కెప్టెన్‌గా ఎంచుకున్నారు. అయినా ఇంగ్లాండ్‌తో రద్దయిన ఆఖరి టెస్టు జరిగి ఉంటే, రహానేకి టీమ్‌లో ప్లేస్ ఉండేదా? అనేది నా అనుమానం...

613

అజింకా రహానే యావరేట్ యేటికేటికి తగ్గుతూ పోతోంది. కొన్ని మ్యాచుల మధ్య ఓ మంచి ఇన్నింగ్స్ ఉంటోంది. కానీ రెండేళ్లలో 20 పాయింట్లు కోల్పోయాడు రహానే...

713

ఇన్నేళ్ల కెరీర్‌లో రహానే సగటు ఇంత దారుణంగా ఎప్పుడూ పడింది లేదు. లార్డ్స్ టెస్టులో అజింకా రహానే హాఫ్ సెంచరీ చేయకపోయి ఉంటే, సీన్ ఇప్పటికే వేరేగా ఉండేది. 

813

పూజారాతో కలిసి రెండో ఇన్నింగ్స్‌లో రహానే నిర్మించిన భాగస్వామ్యం వల్ల అతను తుదిజట్టులో చోటు దక్కించుకోగలిగాడు. రోహిత్ శర్మ టెస్టు టీమ్‌లో ఉండి ఉంటే, అజింకా రహానే కచ్ఛితంగా నోటీసులో ఉండేవాడే...

913

రోహిత్ అండ్ కో బిజీ క్రికెట్ ఆడడం వల్ల రహానేకి కెప్టెన్సీ దక్కింది. అయితే రహానేకి ఇది ఆఖరి అవకాశం కావచ్చు. అతను కెప్టెన్‌గా మెల్‌బోర్న్‌ టెస్టులో ఆడిన ఇన్నింగ్స్‌ లాంటి ఓ ఇన్నింగ్స్ ఆడకపోతే అతని స్థానంలో మరో ప్లేయర్‌ని వెతుక్కోవాల్సిందే..’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

1013

ఇంగ్లాండ్‌ టూర్‌లో నాలుగు టెస్టులు ఆడిన అజింకా రహానే 15.57 సగటుతో 109 పరుగులు చేశాడు. ఇందులో లార్డ్స్ టెస్టులో చేసిన 61 పరుగులు తీసి వేస్తే, మిగిలిన మ్యాచుల్లో 20 పరుగుల మార్కు కూడా చేరుకోలేకపోయాడు...

1113

అజింకా రహానేతో పాటు రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్న ఛతేశ్వర్ పూజారాకి కూడా ఇదే ఆఖరి అవకాశం అని అనుమానిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

1213

స్వదేశంలో జరిగే ఈ టెస్టు సిరీస్‌లో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఎప్పటిలాగే ఫెయిల్ అయితే వారికి రిప్లేస్‌మెంట్‌ తయారుచేసేందుకే శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, శ్రీకర్ భరత్‌లకు అవకాశం ఇచ్చినట్టు బీసీసీఐ అధికారి తెలియచేయడం విశేషం...

1313

కెఎల్ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా ఆడించి, శుబ్‌మన్ గిల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించేందుకు బీసీసీఐ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం... 

Read more Photos on
click me!

Recommended Stories