ఆ ఓటమి తర్వాత అందరితో అంత్యాక్షరి ఆడించిన రవిశాస్త్రి... ఎమ్మెస్ ధోనీ అర్ధరాత్రి దాకా ఆగకుండా...

First Published Nov 13, 2021, 4:21 PM IST

టీ20 వరల్డ్‌‌కప్ 2021 టోర్నీతో హెడ్‌కోచ్ రవిశాస్త్రితో పాటు మెంటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ కాంట్రాక్ట్ గడువు కూడా ముగిసింది. ఇన్నాళ్లు భారత జట్టు పరాజయం ఎదుర్కొన్న ప్రతీసారి ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రవిశాస్త్రి, పదవీ విరమణ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు..

వర్క్ స్ట్రెస్ తగ్గాలన్నా, ఓ పరాజయం నుంచి కోలుకోవాలన్నా మూడ్ మార్చే ఆటవిడుపు అవసరం. వన్డే మ్యాచ్ ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయిన భారత జట్టులో తిరిగి జోష్ నింపేందుకు సరదాగా అంత్యాక్షరి ఆడించాలని అనుకున్నాడట రవిశాస్త్రి...

డిసెంబర్ 2017లో శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు 112 పరుగుల భారీ తేడాత ఓడింది. అది కూడా ధర్మశాలలో జరిగిన మ్యాచ్ కావడంతో టీమిండియా క్రికెటర్లు, పూర్తిగా ఢీలా పడిపోయారు...

మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరూ 8 గంటలకు మీటింగ్‌కి రావాలని హెడ్‌కోచ్ రవిశాస్త్రి, టీమ్ ఇండియా మేనేజర్ సునీల్ సుబ్రమణ్యంతో మెసేజ్ పంపాడట...

ఆ మ్యాచ్‌లో లంక బౌలర్ సురంగ లక్మల్ 10 ఓవర్లు బౌలింగ్ చేసిన కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. లక్మల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ అవుట్ కావడంతో టాపార్డర్ ఫెయిల్ అయ్యింది...

విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వడంతో ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడింది. ఆ మ్యాచ్‌కి కొన్ని రోజుల ముందే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరిగింది. అందుకే ఆ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడలేదు...

‘సురంగ లక్మల్ మనల్ని తిప్పేశాడు. అందరూ 8 గంటలకు బోన్‌ఫైర్ మీటింగ్‌కి రావాలి...’ అని రవిశాస్త్రి మెసేజ్ పంపించాడు. రవిశాస్త్రి ఏం మాట్లాడాలో, ఎలా తిడతాడో అని అందరూ భయపడుతూనే మీటింగ్‌కి వచ్చారు...

‘అందరూ వచ్చాక, ‘మ్యాచ్ గురించి మరిచిపోండి, సరదాగా అంత్యాక్షరి ఆడదాం...’  అంటూ తీరిగ్గా చెప్పాడట రవిశాస్త్రి...  అంతే ఎమ్మెస్ ధోనీ అర్ధరాత్రి 2 గంటల దాకా పాత హిందీ పాటలు పాడుతూనే ఉన్నాడు. దాదాపు ఆరు గంటల పాటు పాటలు పాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ గడిపాం...

అందరూ తమ తమ రూమ్‌లకి వెళ్లేముందు ఎంతో ఆనందంగా ఓటమిని మరిచిపోయి వెళ్లారు. మ్యాచ్‌ ఓటమి జరిగిపోయింది, దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు...

జరగాల్సింది చూడాలి. ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయి. వాటిల్లో గెలిస్తే సిరీస్ సొంతం చేసుకోవచ్చు.. ఆ నమ్మకాన్ని కలిగించడంలో రవిశాస్త్రి సూపర్ సక్సెస్ అయ్యాడు...’ అంటూ తెలిపాడు టీమ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం...

ఊహించినట్టే రెండో మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు, మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. మూడో వన్డేలో రోహిత్ శర్మ 153 బంతుల్లో 208 పరుగులు చేసి... రికార్డు స్థాయిలో మూడో డబుల్ సెంచరీ నమోదుచేశాడు...

click me!