ఏ వెధవా... ఇండియాకి ఆడడం కంటే ఐపీఎల్ ముఖ్యమని అనుకోడు... కపిల్‌దేవ్ కామెంట్లపై సునీల్ గవాస్కర్...

First Published Nov 13, 2021, 4:56 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు పరాజయం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు సగటు క్రికెట్ అభిమాని. టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగి, గ్రూప్ స్టేజ్‌కే పరిమితం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు... 

టీ20 వరల్డ్‌‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు పరాజయం తర్వాత ఐపీఎల్‌పై, బీసీసీఐపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత వెంటనే టీ20 వరల్డ్‌కప్ ఉండడం వల్లే సరిగా ఆడలేకపోయామని బుమ్రా కూడా కామెంట్ చేశాడు...

భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అయితే టీమిండియా ప్లేయర్లు, జాతీయ జట్టుకి ఆడడం కంటే ఐపీఎల్ ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇలాంటి మైండ్‌సెట్ ఉన్నంతకాలం ఏ టైటిల్ గెలవలేమని కామెంట్ చేశాడు...

తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. ‘దేశానికి ఆడడం కంటే ఐపీఎల్ ఆడడమే ముఖ్యమని ఏ వెధవా అనుకోడు. అలా అనుకుంటే టీమిండియా గత ఐదేళ్లలో ఇలాంటి పర్ఫామెన్స్ ఇవ్వదు...

అయితే దేశానికి ఆడడం కంటే ఫ్రాంఛైజీ క్రికట్ ఆడాలనుకునేవాడిని ఏ టీమ్ అయినా ఎందుకు తీసుకుంటుంది. వాళ్లు దేశానికి ఆడుతున్నారు. వారి గుండెలపై బ్యాడ్జి ధరిస్తున్నారు...

ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మంది వారి ఆటను చూస్తున్నారు. 140 కోట్ల మందిలో నుంచి దేశానికి ప్రాతినిథ్యం వహించే 11 మందిలో చోటు దక్కించుకోవడం అదృష్టం, గర్వకారణం...

టీమ్‌లో ప్లేస్ కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన, అనుభవిస్తున్న ప్లేయర్లు కూడా ఉన్నారు. అందరూ టైం లేదని అన్నారు కానీ ఐపీఎల్ ఆడడం వల్లే అలిసిపోయామని చెప్పలేదు...

కపిల్ చెప్పింది నిజమే. భారత జట్టు షెడ్యూల్‌లో ఐపీఎల్ కూడా ఉంది. దాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తాను. దాన్ని అందరూ అంగీకరించాల్సిందే కానీ ట్రోల్ చేయకూడదు. బీసీసీఐ మాత్రమే కాదు, అన్ని క్రికెట్ బోర్డులు లీగ్‌లను నిర్వహిస్తున్నాయి...

అయితే క్రికెట్ బోర్డు, షెడ్యూల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలిన అన్ని జట్ల కంటే భారత జట్టు ఏటా ఎక్కువ మ్యాచులు ఆడుతోందనే విషయాన్ని మరిచిపోకూడదు... ఐపీఎల్ కూడా జత చేస్తే, అది ఇంకా పెరుగుతుంది...

ఐపీఎల్ ఏప్రిల్‌లో క్యాన్సిల్ కావడం వల్ల మరో షెడ్యూల్ దొరకక సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించాల్సి వచ్చింది. బీసీసీఐకి కూడా మరో దారి లేకపోయింది. ఇలాంటివి భవిష్యత్తులో జరుగుతాయని అనుకోను...

ఫైనల్ ఆడుతున్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు గత ఆరు నెలల్లో పెద్దగా క్రికెట్ ఆడింది లేదు. అది వాళ్లకీ, మనకీ ఉన్న తేడా. క్రికెట్‌తో పాడు విశ్రాంతి కూడా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి..

click me!