టీమిండియా కంటే ఆ రెండు జట్లకే వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది... మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..

Published : Aug 19, 2023, 05:25 PM IST

టీమిండియాని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్య వన్డేల్లో సరైన నాలుగో స్థానం బ్యాటర్ లేకపోవడం. నాలుగో స్థానంలో బాగా ఆడుతున్న అంబటి రాయుడిని కాదని  2019 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి విజయ్ శంకర్‌ని ఎంపిక చేయడంపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. నాలుగేళ్ల తర్వాత 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ నాలుగో స్థానం గురించి చర్చ జరుగుతోంది..

PREV
18
టీమిండియా కంటే ఆ రెండు జట్లకే వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది...  మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..

అంబటి రాయుడి తర్వాత శ్రేయాస్ అయ్యర్‌ని నాలుగో స్థానంలో ఆడిస్తూ వచ్చింది టీమిండియా. భారత ఫ్యూచర్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న టీమ్‌లో సెటిల్ అవుతున్న సమయంలోనే గాయాలతో ఆటకు దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్.. 

28
Shreyas Iyer

టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ వల్ల శ్రేయాస్ అయ్యర్ చోటు లేకుండా పోయింది. అయితే వన్డే ఫార్మాట్‌లో మాత్రం సూర్య సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో గాయంతో కొన్ని నెలల పాటు టీమ్‌కి దూరమైనా శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌ అలాగే ఉంది..

38
Sourav Ganguly

2023 వన్డే వరల్డ్ కప్ సమయానికి శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ని ఎక్కువగా వేధిస్తున్న ప్రశ్న ఇదే. దీనికి తన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..
 

48

‘టీమిండియాకి నాలుగో ప్లేస్‌లో సరైన బ్యాటర్ లేడని ఎవరు చెప్పారు. ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేయడానికి మన దగ్గర చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తా, నా మైండ్‌సెట్ వేరేగా ఉంటుంది. టీమిండియాకి వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి..
 

58

తిలక్ వర్మ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అతన్ని నాలుగో స్థానంలో ఆడించొచ్చు. అతను యంగ్ ప్లేయర్, అనుభవం లేకపోయినా టెక్నికల్‌గా చాలా మంచి ప్లేయర్. యశస్వి జైస్వాల్ వంటి యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను టాపార్డర్‌లో చూడాలని అనుకుంటున్నా.. 
 

68

యశస్వి జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్, సెహ్వాగ్‌ని గుర్తుకు తెస్తుంది. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ప్రెషర్‌లో నెట్టేయగల సత్తా అతనికి ఉంది. ఇషాన్ కిషన్ కూడా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ, సెలక్టర్లకు చాలా ఛాయిస్‌లు ఉన్నాయి..

78
Sourav Ganguly

అయితే నిజం చెప్పాలంటే నా ఉద్దేశంలో టీమిండియా కంటే ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉన్న టీమ్ ఆస్ట్రేలియానే... ఆ తర్వాత ఇంగ్లాండ్‌కి కూడా మంచి టీమ్ ఉంది.

88
australia vs india

న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయొద్దు. సౌతాఫ్రికాకి కూడా మంచి టీమ్ దొరికింది. టాప్ 5 టీమ్స్ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్...’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ.. 

click me!

Recommended Stories