ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయబడ్డ శ్రీలంక జట్టుకి... వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఊహించని షాక్ తగిలింది.
బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి, ఇంగ్లాండ్‌లో అర్ధరాత్రి ఇష్టారాజ్యంగా తిరిగిన కుశాల్ మెండీస్, నిరోషన్ డిక్‌వాలా, దనుష్క గుణతిలకలపై సస్పెషన్ వేటు వేసింది లంక బోర్డు...
ఆదివారం అర్ధరాత్రి లండన్ వీధుల్లో శ్రీలంక క్రికెటర్లు ఇష్టారాజ్యంగా తిరుగుతూ సిగరెట్లు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సంఘటనపై విచారణ చేపట్టిన లంక బోర్డు, ఆ వీడియోల్లో ఉన్నది శ్రీలంక క్రికెటర్లు మెండీస్, డిక్‌వాలా, గుణతిలక అని తేలడంతో వారిపై సస్పెషన్ వేటు వేసింది.
వాళ్లు మిగిలిన ప్లేయర్లతో కలవకుండా, వన్డే సిరీస్‌లో పాల్గొనకుండా ఉండేలా స్వదేశానికి తిరిగి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది లంక క్రికెట్ బోర్డు.
ఇప్పటికే టీ20 సిరీస్‌లో ఏ మాత్రం పోరాటం చూపించలేకపోయిన లంక జట్టు, ఇప్పుడు ముగ్గురు ప్లేయర్లు దూరం కావడంతో వన్డేల్లో ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి...
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లకు కూడా ఈ ముగ్గురు క్రికెటర్లను జట్టులోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేసింది లంక క్రికెట్ బోర్డు.