‘అవుట్ కాకుండా ఉండాలని బ్యాటింగ్ చేస్తే, ఎలాంటి లాభం ఉండదు. క్రీజులో ఉన్నప్పుడు పరుగులు చేయాలి. ఎంత సేపు ఉన్నా పరుగులు రాకపోతే, ఏం లాభం’ అంటూ డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు...
డైరెక్టుగా ఛతేశ్వర్ పూజారా అని చెప్పకపోయినా, అతని గురించే కోహ్లీ ఈ విధంగా కామెంట్ చేస్తున్నట్టు అందరికీ క్లియర్‌గా అర్థమైంది. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన పూజారాని, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరంగా పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది...
‘ఛతేశ్వర్ పూజారా, టీమిండియాకి టెస్టుల్లో కీ ప్లేయర్. అతని డిఫెన్సే చాలా మ్యాచుల్లో ఘోర పరాజయాలను తప్పించి, టీమిండియాకి ఎన్నో విజయాలను అందించింది...
ఒక ఎండ్‌లో పూజారా పాతుకుపోవడం వల్లే మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడు. పూజారా టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు...
అతను వరల్డ్ క్లాస్ టెస్టు బ్యాట్స్‌మెన్. అయినా మిగిలినవాళ్లు ఏమైనా వేగంగా పరుగులు సాధించారా? న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కూడా సౌంతిప్టన్‌లో పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డారు.
కేన్ విలియంసన్ తొలి ఇన్నింగ్స్‌లో 100 బంతులకు పైగా ఎదుర్కొన్న చేసింది 15 పరుగులే. అంటే డిఫెన్స్‌కి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు...
కేన్ విలియంసన్ ఓ ఎండ్‌లో పాతుకుపోయి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడం వల్లే మరో ఎండ్‌లో టెయిలెండర్లు టిమ్ సౌథీ, జెమ్మీసన్ ఎదురుదాడికి దిగి వేగంగా పరుగులు చేయగలగారు...
అయినా ఛతేశ్వర్ పూజారాని నిందించి, లేదా అతన్ని పక్కనబెట్టి టీమిండియా విజయాల బాట పట్టించడం చాలా కష్టం. అది అసాధ్యం అని చెప్పాలి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
వాస్తవానికి భారత సారథి విరాట్ కోహ్లీ కూడా తొలి ఇన్నింగ్స్‌లో జిడ్డు బ్యాటింగ్ చేశాడు. 132 బంతులు ఆడి కేవలం ఒకే ఒక్క ఫోర్‌తో 44 పరుగులు చేశాడు...
కేన్ విలియంసన్ అయితే 177 బంతులు ఆడి 6 ఫోర్లతో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన డివాన్ కాన్వే కూడా 153 బంతులు ఆడి 6 ఫోర్లతో 54 పరుగులు చేశాడు.