నేను మరీ అంత చెత్త బౌలర్‌నా? స్పిన్ పిచ్‌పై కూడా ఆడించలేదు... కుల్దీప్ యాదవ్ అసహనం...

First Published May 13, 2021, 11:05 AM IST

కుల్దీప్ యాదవ్... ఒకప్పుడు భారత జట్టులో స్టార్ స్పిన్నర్. ఓ వైపు అశ్విన్, జడేజా టెస్టుల్లో అదరగొడుతుంటే యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి వన్డే, టీ20ల్లో అదరగొట్టేవాడు కుల్దీప్ యాదవ్. హ్యాట్రిక్ సాధించిన కుల్దీప్ యాదవ్‌ పొజిషన్ ఇప్పుడే మాత్రం బాగోలేదు. అటు టీమిండియాలో, ఇటు ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టులో చోటు కోల్పోయిన కుల్దీప్ యాదవ్, రిజర్వు బెంచ్‌లో డ్రింక్స్ మోస్తూనే సమయం గడిపేస్తున్నాడు.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు తరుపున 2018 సీజన్‌లో 17 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు కుల్దీప్ యాదవ్. అయితే గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత కుల్దీప్ యాదవ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2021 సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు కుల్దీప్ యాదవ్...
undefined
దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో 2019 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అంతే ఆ తర్వాత కుల్దీప్ యాదవ్‌పై నమ్మకం కోల్పోయినట్టున్నాడు కార్తీక్. గత సీజన్‌లో 5 మ్యాచులు ఆడినా కుల్దీప్ యాదవ్ వేసింది 12 ఓవర్లే...
undefined
మిగిలిన బౌలర్ల కోటా దాదాపు ముగిసే సమయంలో అదనపు బౌలర్ ఆప్షన్‌గానే కుల్దీప్ యాదవ్‌కి బంతిని అందించాడు కార్తీక్. దినేశ్ కార్తీక్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న ఇయాన్ మోర్గాన్‌, అయితే కుల్దీప్ యాదవ్‌కి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.
undefined
2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు 7 మ్యాచులు ఆడితే, అందులో ఒక్క మ్యాచ్‌లో కూడా కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కలేదు. అదీకాక 7 మ్యాచుల్లో 6 మ్యాచులు స్పిన్‌కి బాగా అనుకూలిస్తున్న చెన్నైలోనే ఆడింది కేకేఆర్...
undefined
‘ఏ బౌలర్‌కి అయినా విరామం లేకుండా క్రికెట్ ఆడుతుంటే ఆత్మవిశ్వాసం పెరిగి, బౌలింగ్ మరింత మెరుగవుతుంది. కానీ నా పరిస్థితి వేరు. నేను ప్రతీ సీజన్‌కి ఎంపిక అవుతున్నా, కానీ రిజర్వు బెంచ్‌కే పరిమితమవుతున్నా...
undefined
జట్టుకి ఎంపిక చేసి, ఆడించకుండా పక్కనబెడితే నా పరిస్థితి ఎలా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నా. దాదాపు ఏడాది తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అవకాశం వచ్చింది. ఊపిరి పీల్చుకున్నా. కానీ ఆ మ్యాచ్‌లో నాకు బౌలింగ్ వేసే అవకాశం వచ్చిందే తక్కువ...
undefined
నేను మరీ అంత చెత్త బౌలర్‌నా? నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు కెప్టెన్ ఎవ్వరైనా నాపై భరోసా పెట్టేవాళ్లు. ఎక్కువ ఓవర్లు నాతోనే బౌలింగ్ చేయించేవాళ్లు. ఏ నేనిప్పుడు మునుపటి కుల్దీప్ యాదవ్‌ని కాదా?
undefined
కేకేఆర్ ఆడిన మ్యాచుల్లోనూ నాకు అవకాశం రాలేదు. చెన్నైలాంటి స్పిన్ పిచ్ మీద కూడా నేను వికెట్లు తీయలేనంత పనికిరాని వాడినా? మరీ అంత చెత్తగా ఆడతానా? నామీద నాకే అనుమానం కలిగింది...
undefined
రిజర్వు బెంచ్‌లో కూర్చోలేకపోతున్నాను. డ్రింక్స్ మోయడానికే నన్ను ఎంపిక చేస్తున్నారా? అని కోచ్ రవిశాస్త్రిని, కెప్టెన్ విరాట్ కోహ్లీని అడిగాను. వాళ్లు నాకు ధైర్యం చెప్పారు. అవకాశం కోసం ఎదురుచూడాలని భరోసా ఇచ్చారు...
undefined
టీమ్ కాంబినేషన్ల కోసం నన్ను పక్కనబెడుతున్నారని చెప్పారు. నేను మహీ భాయ్‌ను బాగా మిసవుతున్నాను. ధోనీ భాయ్ చెప్పే సలహాలతో వికెట్లు తీసేవాడిని. అతని అనుభవం మిస్ కావడం కూడా నా బౌలింగ్‌పైన ప్రభావం పడుతుందేమో’ అంటూ కామెంట్ చేశాడు కుల్దీప్ యాదవ్..
undefined
జూన్ 18 నుంచి 22 వరకూ న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కలేదు. ఆ తర్వాత జరిగే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లోనూ కుల్దీప్ యాదవ్ లేనట్టే...
undefined
అయితే ఇదే సమయంలో శ్రీలంకలో పర్యటించే జట్టులో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే యజ్వేంద్ర చాహాల్‌తో పాటు రవి బిష్ణోయ్ వంటి యువ స్పిన్నర్లకు ఈ టూర్‌లో చోటు దక్కితే, కుల్దీప్ మళ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావచ్చు.
undefined
click me!