లంకకు మరో ఎదురుదెబ్బ... గాయాలతో ఆ ఇద్దరు క్రికెటర్లు దూరం...

First Published Jul 16, 2021, 12:25 PM IST

టీమిండియాతో సిరీస్ ఆరంభానికి ముందే లంక జట్టుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో కరోనా ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ముగ్గురు సీనియర్లపై నిషేధం విధించిన లంక బోర్డుకు గాయాలు ఊహించని షాక్ ఇచ్చాడు...

శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరేరా, భుజం గాయం కారణంగా భారత్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. పెరేరా కోలుకోవడానికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు...
undefined
శ్రీలంక తరుపున 104 వన్డేలు, 47 టీ20 మ్యాచులు, 22 టెస్టులు ఆడిన కుశాల్ పెరేరా, లంక కెప్టెన్‌గా కూడా కొన్ని మ్యాచుల్లో వ్యవహరించాడు. 3 వేలకు పైగా వన్డే పరుగులు చేసిన పెరేరా లేకపోవడం లంక పర్ఫామెన్స్‌పై మరింత ప్రభావం చూపించొచ్చు.
undefined
అతనితో పాటు శ్రీలంక పేసర్ బినురా ఫెర్నాండో కూడా గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. ఫెర్నాండో టీ20 సిరీస్ సమయానికి కోలుకుని రీఎంట్రీ ఇస్తాడని ఆశిస్తోంది లంక బోర్డు...
undefined
ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘించి, బయో బబుల్ దాటి బయటికి వెళ్లిన ముగ్గురు క్రికెటర్లు కుశాల్ మెండీస్, నిరోషన్ డిక్‌వాలా, దనుష్క గుణతిలకలపై సస్పెషన్ వేటు వేసింది లంక బోర్డు...
undefined
తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు గాయాల కారణంగా తప్పుకోవడంతో లంక జట్టు ఇబ్బందులు ఎదుర్కోనుంది... ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో ఒక్క విజయం కూడా లేకుండానే తిరిగి వచ్చారు లంకేయులు...
undefined
స్వదేశం చేరుకున్న తర్వాత శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌తో పాటు మరో ఇద్దరు కరోనా బారిన పడడంతో జూలై 13న ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్ కాస్తా, 18కి వాయిదా పడింది...
undefined
click me!