Virat Kohli: ‘అతడు నెలకొల్పిన రికార్డుల ముందు ఈ 30, 40 లు ఏం సరిపోతాయి..? గేర్ మార్చాల్సిందే..’

Published : Jul 24, 2022, 11:49 PM IST

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ పై చర్చ ఇప్పట్లో ముగిసేలా లేదు. కోహ్లీ ఆటతీరుపై ఎవరి అభిప్రాయం వాళ్లు వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మాజీ క్రికెటర్, మహిళల జట్టు సారథిగా పనిచేసిన అంజుమ్ చోప్రా కూడా చేరింది. 

PREV
16
Virat Kohli: ‘అతడు నెలకొల్పిన రికార్డుల ముందు ఈ 30, 40 లు ఏం సరిపోతాయి..?  గేర్ మార్చాల్సిందే..’

పేలవ ఫామ్ తో తంటాలుపడుతున్న విరాట్ కోహ్లీ త్వరలోనే ఈ దశనుంచి బయపడతాడని అంటున్నది టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రా. ఒక  దిగ్గజ బ్యాటర్ గా కోహ్లీ నెలకొల్పిన ప్రమాణాలు, ప్రస్తుతం అతడు ఆడుతున్న ఆట పొంతన లేకుండా ఉన్నదని ఆమె వ్యాఖ్యానించింది. 

26
Image credit: Getty

కోహ్లీ ఫామ్ పై అంజుమ్ చోప్రా ప్రముఖ వార్తా సంస్థ ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ 30,40 పరుగులు చేస్తూ జాతీయ జట్టులో కొనసాగిన వారిని నేను చాలా మంది చూశాను. కానీ కోహ్లీ అలా కాదు.. 

36

ఒక బ్యాటర్ గా అతడు నెలకొల్పిన ప్రమాణాలు వేరు. కానీ అతడు ఇప్పుడు 30, 40 స్కోర్లు చేస్తుంటే చూడటం ఆ ప్రమాణాలకు  సరిపోవడం లేదు. అయితే కోహ్లీ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఒక క్లిష్ట దశను ఎదుర్కుంటున్నాడు. కానీ అతడు దానిని త్వరలోనే అధిగమిస్తాడు. తిరిగి మళ్లీ పరుగులు సాధిస్తాడన్న నమ్మకం నాకుంది..
 

46

కోహ్లీకి ఏం కావాలో అతడికి భాగా తెలుసు. మీరు మీ ప్రమాణాల  ప్రకారం ఆడకుంటే మరింత ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది.  అతడు ఇప్పుడు గతం కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాడనే అనుకుంటున్నా. తద్వారా అతడు తన మునపటి ఫామ్ ను అందుకుంటాడు. ఫామ్ పొందాలంటే ప్రాక్టీస్ కు మించిన మరో ఆప్షన్ లేదు. 

56

ప్రపంచంలో ఏ ఆటగాడైనా ఇలాంటి ఒక దశను అనుభవించాల్సిందే. కానీ ఈ దశను దాటడానికి కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు. అదీగాక దీనిని ఎలా దాటాలో అతడికి తెలుసు. అందుకు కఠోర శ్రమ చేయాలి. అయితే ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు పరిస్థితులు మీకు అనుకూలించవు. అయినా  ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు..’ అని కోహ్లీకి సూచించింది. 

66

ఐపీఎల్ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్ కు విశ్రాంతి తీసుకుని ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ.. ఎడ్జబాస్టన్ టెస్టులో 31 పరుగులే చేశాడు. ఆ తర్వాత రెండు టీ20లలో 12, రెండు వన్డేలలో 33 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.  ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్ కు కూడా అతడు అందుబాటులో లేడు. ప్రస్తుతం కోహ్లీ పారిస్ లో ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories