ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు టీమిండియాకి మరో షాక్... గాయంతో మరో ప్లేయర్ అవుట్...

Published : Aug 25, 2022, 04:07 PM IST

ఆసియా కప్ 2022 ఆరంభానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లన్నీ యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాయి. అయితే టోర్నీ ఆరంభానికి రెండు రోజుల ముందు టీమిండియాకి మరో షాక్ తగిలింది. దాదాపు ఆరు నెలల తర్వాత గాయం నుంచి కోలుకుని, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో పాల్గొన్న దీపక్ చాహార్.. మళ్లీ గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి...

PREV
16
ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు టీమిండియాకి మరో షాక్... గాయంతో మరో ప్లేయర్ అవుట్...


జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డేలో 3 వికెట్లు తీసి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు దీపక్ చాహార్. అయితే ఆ తర్వాత రెండో వన్డేలో దీపక్ చాహార్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఆరు నెలల తర్వాత ఒక్క మ్యాచ్ ఆడిన దీపక్ చాహార్‌కి, రెండో వన్డేలో రెస్ట్ ఇవ్వడంపై పెద్ద చర్చే జరిగింది...

26
Deepak Chahar

అయితే మూడో వన్డేలో దీపక్ చాహార్‌ని తిరిగి జట్టులోకి తీసుకొచ్చిన మేనేజ్‌మెంట్, అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ వంటి సీనియర్లు గాయపడి, ఆసియా కప్ 2022 టోర్నీకి దూరం కావడంతో దీపక్ చాహార్‌కి తుది 15 మంది జట్టులో చోటు ఇస్తే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు...

36

అయితే టోర్నీ ఆరంభానికి ముందు దీపక్ చాహార్ మరోసారి గాయపడి, ఆసియా కప్ 2022 మొత్తానికి దూరమైనట్టు సమాచారం. దీపక్ చాహార్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కుల్దీప్ సేన్‌కి ఆసియా కప్‌లో అవకాశం ఇచ్చింది బీసీసీఐ. దీపక్ చాహార్ స్థానంలో కుల్దీప్ సేన్, స్టాండ్ బై ప్లేయర్‌గా వ్యవహరిస్తాడు...

46

టీమిండియాకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన కుల్దీప్ సేన్, ఆసియా కప్ 2022లో నెట్ బౌలర్‌గా వ్యవహరించబోతున్నాడు. దీపక్ చాహార్‌తో పాటు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీస్‌లో గాయపడినట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలింది...

56

ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరంగా ఉన్న దీపక్ చాహార్, కమ్‌బ్యాక్ తర్వాత జింబాబ్వేతో రెండు వన్డేలు మాత్రమే ఆడాడు.. దీపక్ చాహార్ మళ్లీ గాయపడ్డాడనే వార్తలు రావడం అతని ఫ్యాన్స్‌ని కలవరబెడుతోంది...
 

66

దీపక్ చాహార్ కూడా గాయపడడంతో భువనేశ్వర్ కుమార్ ఒక్కడూ టీమిండియాకి సీనియర్ ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. అతనితో పాటు ఆసియా కప్‌ 2022 టోర్నీకి ఎంపికైన ఆవేశ్ ఖాన్, జింబాబ్వే టూర్‌లో అట్టర్ ఫ్లాప్ కాగా... అర్ష్‌దీప్ సింగ్‌కి పట్టుమని ఐదు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేదు... 

click me!

Recommended Stories