మూడు ఫార్మాట్లలో ఒకే ఒక్కడు... వందో టీ20తో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత...

First Published Aug 25, 2022, 1:55 PM IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డుల పుస్తకంలో మరో అరుదైన ఘనత చేరనుంది.ఇప్పటికే 99 అంతర్జాతీయ టీ20 మ్యాచులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో 100 టీ20లు పూర్తి చేసుకోబోతున్నాడు. భారత జట్టు తరుపున ఇప్పటికే రోహిత్ శర్మ 132 టీ20 మ్యాచులు ఆడి టాప్‌లో ఉన్నాడు... అయితే మూడు ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలవబోతున్నాడు విరాట్...

virat kohli

టీమిండియా తరుపున 100+ టీ20 మ్యాచులు ఆడబోతున్న రెండో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్న విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లలో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...

టీమిండియా తరుపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచులు ఆడిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... టీ20ల్లో ఈ రికార్డును 2 మ్యాచుల తేడాతో మిస్ చేసుకోగా... టెస్టుల్లో 100 టెస్టుల ఫీట్‌కి 10 మ్యాచుల దూరంలో రిటైర్మెంట్ తీసుకున్నాడు...

టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ ఇప్పటికే 132 టీ20 మ్యాచులు ఆడి, 233 వన్డేలు కూడా ఆడాడు. అయితే టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ చాలా దూరంలో ఉన్నాడు. 45 టెస్టులు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ, 50 టెస్టులను పూర్తి చేసుకోగలడేమో కానీ 100 టెస్టుల ఘనత సాధించడం సాధ్యమయ్యే పని కాదు...

Virat Kohli-Babar Azam

2013, జూన్ 11న వందో వన్డే మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ, 2022, మార్చి 4న శ్రీలంకపై వందో టెస్టు మ్యాచ్ ఆడాడు. 2022 ఆగస్టు 28న పాకిస్తాన్‌పై వందో టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ.. 

Image credit: Getty

ఓవరాల్‌గా ఇంతకుముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ ఒక్కడే మూడు ఫార్మాట్లలో 100కి పైగా మ్యాచులు ఆడాడు.. 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచులు ఆడిన రాస్ టేలర్, గత ఏడాది చివరన అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు...

virat kohli

వన్డే, టీ20, టెస్టులతో పాటు ఐపీఎల్‌లో 100కి పైగా మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్‌గా నిలవబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు ఏ ప్లేయర్ కూడా ఈ ఘనత సాధించలేకపోయారు. 

click me!