WPL 2023 ప్రారంభ వేడుకలకు భారీ ఏర్పాట్లు... కియారా అద్వాణీ, కృతి సనన్‌ ఆట, దిల్లాన్ పాట...

Published : Mar 01, 2023, 12:44 PM IST

బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభిస్తున్న లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. పురుషుల ఐపీఎల్ ప్రారంభమైన 16 సీజన్ల తర్వాత మహిళల కోసం పూర్తి స్థాయిలో ఓ టీ20 లీగ్‌ని తీసుకురానుంది బీసీసీఐ. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది...  

PREV
17
WPL 2023 ప్రారంభ వేడుకలకు భారీ ఏర్పాట్లు... కియారా అద్వాణీ, కృతి సనన్‌ ఆట, దిల్లాన్ పాట...

మార్చి 4న ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌తో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌కి ముందు ముంబైలో డబ్ల్యూపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించబోతోంది బీసీసీఐ...

27
kiara advani

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరంభ వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వాణీ డ్యాన్స్‌ షోలతో అలరించబోతున్నారు. మహేష్ ‘వన్ నేనొక్కడినే’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్, బాలీవుడ్‌లో ‘హీరోపంటి’, ‘హౌస్‌ఫుల్ 4’, ‘బరెలీకి బర్ఫీ’ వంటి వరుస సినిమాల్లో నటించింది..

37
Kriti Sanon

ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ సినిమా చేసిన కృతి సనన్, త్వరలో ‘గణపత్’ అనే సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన నటించబోతోంది. ప్రభాస్‌తో కృతి సనన్ డేటింగ్ చేస్తుందనే వార్తలు రావడం, ఇక్కడ ఆమెకు మంచి పాపులారిటీ వచ్చేసింది...
 

47

మరోవైపు ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాల్లో నటించి తెలుగువారికి చేరువైన కియారా అద్వాణీ, గత నెలలో బాలీవుడ్ కుర్ర హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్న కియారా.. యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది...
 

57

ఈ ఇద్దరూ హీరోయిన్లు డ్యాన్సులతో స్టేజీలో హీట్ పెంచబోతున్నారు. వీరితో పాటు సింగర్, ర్యాపర్ ఏపీ దిల్లాన్ తన పర్ఫామెన్స్‌తో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాడు. 

67

ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, బార్బోడస్ స్టేడియాల్లో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు బుక్‌మైషో యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి...

77

కేవలం 100, 400 కనీస ధరలతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు చూసేందుకు అవకాశం కల్పించింది బీసీసీఐ. అదీకాకుండా అమ్మాయిలకు, మహిళలకు స్టేడియంలోకి అనుమతి ఉచితం..
 

click me!

Recommended Stories